నా అన్నయ్యను కోల్పోయా.. విగ్రహం ఏర్పాటు చేస్తాం: చెవిరెడ్డి

నా అన్నయ్యను కోల్పోయా.. విగ్రహం ఏర్పాటు చేస్తాం: చెవిరెడ్డితిరుపతి: ఆంధ్రప్రదేశ్ సర్కార్ తరఫున మాజీ ఎంపీ శివప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం నాడు శివప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. శివప్రసాద్ ప్రజల మనిషని.. తన అన్నను కోల్పోయానని చెవిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. శివప్రసాద్ స్వగ్రామం పులిత్తివారిపల్లిలో త్వరలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరితో కలిసిపోయే వ్యక్తన్నారు. 'శివప్రసాద్ మనస్సున్న మారాజు. ప్రభుత్వం తరపున శివప్రసాద్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తాం' అని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. చెవిరెడ్డి ప్రకటనతో శివప్రసాద్ అనుచరులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.