గుంటూరు లో అధిక వడ్డీ వసూలు

.
  


గుంటూరు రైల్వే కోటర్స్ లో ఉంటున్న రైల్వే ఉద్యోగి గుంటూరు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డీ రామకృష్ణ గారి వద్దకు వచ్చి తాను కొత్త పేట పోలీస్ స్టేషన్ ఏరియా లోని రాజాగారి తోటలో శ్రీ లక్ష్మీ గణపతి ఆంజనేయ ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్న కొండమడుగు రత్నారెడ్డి అనునతని వద్ద 2007వ సంవత్సరంలో 2 రూపాయల వడ్డీకి పదివేల రూపాయలు అప్పుగా తీసుకొని ఖాళీ నోట్ల పైన నా సంతకాలు పెట్టి డబ్బు తీసుకున్నట్లు , ఆ తర్వాత రత్నారెడ్డి రెండు కాకుండా నాలుగు రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేస్తుండగా, మొత్తం డబ్బులు చెల్లించానని,   అయినా కూడా, నాచే సంతకాలు చేయించుకొన్న ప్రామిసరీ నోట్లు తిరిగి నాకు ఇవ్వకుండా,నేను  వేరొకరికి నాలుగు లక్షల రూపాయల అప్పుకు హామీగా నోట్లు రాసినట్లుగా చూపించుకొని కోర్టులో వేసి, డిక్రీ పొంది నెలకి పదివేలు చొప్పున 8,50,103/-  రూపాయలు  అక్రమంగా వసూలు చేసినాడని , ఇదే విధంగా అనేక మంది వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు అతనికి కొందరు సహకరిస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లుగా అర్జిద్వారా విన్నవించుకోగా దానిపై ఎస్పీగారు వెంటనే తగిన చర్యలు తీసుకోవలసింది గా SHO , కొత్తపేట వారికి ఆదేశాలు ఇచ్చినారు.


దానిమీద ఫిర్యాదు దారుడిని విచారించిన సిఐ ఎస్వి రాజశేఖరరెడ్డి గారు కొత్తపేట పోలీసు స్టేషన్ లో కేసు నమోదుచేసి దర్యాప్తులో భాగంగా 6-9-2019 వ తేదీన  సిబ్బంది / మధ్యవర్తులు అయినా వీఆర్వో లను వెంటబెట్టుకొని రాజాగారితోట లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి  ఆంజనేయ కంపెనీ పైన సోదాలు నిర్వహిం 225 వివిధ వ్యక్తులకు చెందిన ఎటిఎం కార్డ్స్ , 38 వివిధ వ్యక్తులకు చెందిన పాస్ పుస్తకాలు, 102 సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు, 293 సంతకం చేసి ఉన్న బ్యాంకులు చెక్కులు , నగదు 1,40,850/- రూపాయలు, 8 పట్టాదారు పాసు పుస్తకాలు,  20 విక్రయ దస్తావేజులు, మరియు వీరి ఫైనాన్స్ కంపెనీకి చెందిన లెక్కల పుస్తకాలు మొదలైన వాటిని స్వాధీనం చేసుకుని రత్నారెడ్డిని అరెస్టు చేయడం జరిగింది.


 ఈ కేసులో ముద్దాయి అయిన కొండమడుగుల రత్నారెడ్డి సంవత్సరానికి ఇతని ఫైనాన్స్ కంపెనీ ద్వారా సుమారు రెండు నుండి మూడు కోట్ల రూపాయలు వ్యాపారము చేయు ఉన్నట్లు తెలియ వచ్చింది.


ఇటు వంటి ఫైనాన్స్ వ్యాపారులు అనేకమంది ప్రస్తుత సమాజంలో చిరు ఉద్యోగులను , చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారిని, పేద ప్రజలను , అవసరాలు ఉండి చేతిలో డబ్బులులేక వడ్డీవ్యాపారుల వద్దకు వచ్చి అప్పులు చేయడం,  అట్టి ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని , అధిక వడ్డీలు గుంజుచూ, ఖాళీ ప్రామిసరీ నోట్లు , పూర్తి చేయని బ్యాంకు చెక్కులుపై సంతకాలు చేయించుకొని , అప్పు మొత్తం తీర్చినా కూడా వివిధ కారణాలతో వాటిని తిరిగి ఇవ్వకుండా వారి అనుయాయులు , బంధువులు పేర్లతో  ఎండార్స్మెంట్ చేసి కోర్టులలో కేసులు దాఖలు చేయడం , కోర్టులో డిక్రీలు పొంది, మరలా అధిక మొత్తాల్లో డబ్బులు గుంజడం , ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటివి అనేకం జరుగుతున్నాయి.


 ఇటువంటి కేసుల లో ముద్దాయిలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం జరగదని చట్టప్రకారం వారి అందరి పై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని అర్బన్ ఎస్పీ రామకృష్ణ  తెలియపరిచారు.
వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా ఆస్తులు స్వాధీనం చేసు కోవటమే కాకుండా కొన్ని సందర్భాలలో మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడం , వారిని లైంగికంగా వేధించడం వంటి కాల్ మనీ కేసులు కూడా జరగడం మనం సమాజంలో చూస్తున్నాము. వీటన్నిటికీ చట్ట ప్రకారమే చెక్ పెట్టేందుకు , నేరస్తులను కటకటాల వెనక్కి పంపేందుకు తగిన ఆదేశాలు అర్బన్ పరిధిలోని అధికారులకు ఇవ్వడం జరిగిందని , పోలీసులు అక్రమార్కులను అధిక వడ్డీలు గుంజుతున్న జలగల పై మాత్రమే మనము చర్యలు తీసుకోవాలి గానీ అవసరానికి అప్పులు తీసుకుని బాకీలు తీర్చకుండా వుండే వారికి ఈ విషయంలో జాగ్రత్త వహించాలని కూడా అర్బన్ ఎస్పీ రామకృష్ణ  ఈసందర్భంగా  పోలీసు అధికారులను కోరారు. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలి కానీ మొక్కుబడిగా చేయరాదని ఆదేశించారు.


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
పౌష్ఠిక ఆహారం అందజేత
Image
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Image