కవల పిల్లలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ

మంగాయమ్మ: కవల పిల్లలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ
మంగాయమ్మకు జన్మించిన పాపను ఎత్తుకున్న మహిళ
తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన యరమాటి మంగాయమ్మ 74 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు.
ఇద్దరూ ఆడపిల్లలు. ఉదయం 10.30 గంటలకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా వీరిని డాక్టర్లు బయటకు తీశారు. ప్రస్తుతం పిల్లలు, తల్లి క్షేమంగానే ఉన్నారని గుంటూరు నగరంలోని నర్సింగ్ హోమ్ వర్గాలు తెలిపాయి. పిల్లలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఒక్కొక్కరూ 1.5 కిలోల చొప్పున బరువు ఉన్నారని ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ ఉమా శంకర్ బీబీసీతో చెప్పారు. ప్రస్తుతానికి మంగాయమ్మను, పిల్లలను ఆరు గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచామని వెల్లడించారు. వయసు పైబడిన మహిళలు పిల్లలకు జన్మనిచ్చినప్పుడు.. సాధారణంగా రొమ్ముపాలు ఇవ్వకుండా చూస్తామని, వేరే తల్లుల పాలు పడతామని ఆయన తెలిపారు.
'గొడ్రాలు అనేవాళ్లు.. చాలా బాధలు పడ్డాం' - మంగాయమ్మ
తనను గొడ్రాలు అంటూ చుట్టుపక్కల వాళ్లు నిందించేవాళ్లని, అందుకే పిల్లలకు జన్మనివ్వాలనుకుంటున్నానని మంగాయమ్మ తరచూ చెప్పేవారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సిజేరియన్ తర్వాత మంగాయమ్మ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ''ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన సమయం. ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎందరో డాక్టర్లను కలిసాం. గొడ్రాలు అని అందరూ అంటుంటే చాలా బాధలు పడ్డాం. ఇద్దరు బిడ్డలు కలగడం ఆనందంగా ఉంది. అంతా డాక్టర్ ఉమా శంకర్  చలువ'' అంటూ వ్యాఖ్యానించారు.                                                 'నన్ను గొడ్రాజు అనేవాళ్లు.. ఆ ముద్ర పోయింది' - మంగాయమ్మ భర్త రాజారావు
మంగాయమ్మ భర్త యరమాటి సీతారామ రాజారావు తన ఆనందాన్ని పంచుకున్నారు. ''చాలా సంతోషంగా ఉంది. అంతా డాక్టర్ల కృషి. మొదట్లో మేము కూడా చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయాం. అయినా ఈ డాక్టర్ గురించి విని ఓ ప్రయత్నం చేద్దామని వచ్చాము. రెండు నెలలకే గర్భం రావడంతో నమ్మకం కుదిరింది. గతంలో కొన్నిసార్లు అలానే జరిగి మళ్ళీ పోయేది. అందుకే 9నెలలుగా ఆస్పత్రిలో నే ఉన్నాం. ఈరోజు పిల్లలను చూసిన తర్వాత మా వాళ్ళు అందరూ నన్ను గొడ్రాజు అంటూ వేసిన ముద్ర పోయింది. పిల్లలు ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటాం'' అంటూ చెప్పుకొచ్చారు.
సిజేరియన్ జరపడానికి ముందు ఆస్పత్రిలో మంగాయమ్మకు సీమంతం జరిపారు
ఇదీ మంగాయమ్మ కథ..
తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన యరమాటి సీతారామ రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న వివాహమైంది. పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారి ఆశ తీరకుండానే ఇద్దరూ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. అయినప్పటికీ మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలనే కోరిక బలీయంగా ఉంది. వారికి పొరుగున ఉండే ఒక మహిళ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి కావడంతో, తానూ పిల్లల కోసం ఆ పద్ధతిని ఆశ్రయించాలని మంగాయమ్మ నిర్ణయించుకున్నారు. నిరుడు నవంబరులో గుంటూరులోని ఒక నర్సింగ్‌ హోమ్‌కు మంగాయమ్మ దంపతులు వచ్చి ఐవీఎఫ్‌ నిపుణులైన డాక్టర్‌ ఉమాశంకర్‌ను కలిశారు. బీపీ, షుగర్‌ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మంగాయమ్మ మెనోపాజ్‌ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని.. మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) పద్ధతిలో ప్రయత్నం చేశారు. మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించింది. ఈ ఏడాది జనవరిలో మంగాయమ్మ గర్భం ధరించినట్లు తేలింది. అప్పటి నుంచి ఆమెను ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. స్కానింగ్‌లో మంగాయమ్మ గర్భంలో కవలలు ఉన్నట్లు తెలిసింది. 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ కవలలకు జన్మనివ్వడం ప్రపంచ రికార్డు అని డాక్టర్ చెప్పారు.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image