ఇసుక విధానం పై మంత్రి సమీక్ష

నెల్లూరు జిల్లాలో అమలవుతున్న ఇసుక సరఫరాపై  నెల్లూరు నగరంలోని పినాకిని అతిథి గృహంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి రెవెన్యూ, పోలీసు, విజిలెన్సు, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఐశ్వర్య రస్తోగి వున్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.