ఆయుర్వేదనికి పుట్టినిల్లు భారతదేశం:
బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు
●ఇంపీకోప్స్ కార్యక్రమం లో పాల్గొన్న ప్రథమ పౌరులు..
GWMC,12 సెప్టెంబర్ 2019:
ఆయుర్వేదనికి పుట్టినిల్లు భారతదేశం అనిబల్దియా మేయర్ గుండా ప్రకాశరావు అన్నారు. గురువారంఇండియన్ మెడికల్ పాక్టిషనర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్(IMPCOPS) ఏర్పడి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వరంగల్ బట్టల బజార్ లోని ఇంపీకోప్స్ స్టోర్ లో నిర్వహించిన ప్లాటినం సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొని స్టోర్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ వైద్య రత్న డా.శ్రీనివాస మూర్తి చిత్రపటం ముందు పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు.అనంతరం ఆయుర్యేదానికి ఆద్యులు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ ధన్వంతరి చిత్రపటం ముందు ఏర్పాటుచేసిన జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ ఆయుర్వేదం ద్వారా అనేక దీర్ఘకాలిక రోగాలు నయం అయినట్లు చరిత్రలో స్పష్టం గా తెలుపబడింది అని అన్నారు.వరంగల్ నగరం లో సుమారు 400 మంది పదవీవిరమణ పొందిన ఆయుర్వేద డాక్టర్లు ఉన్నామని వివిధ రకాల ఆయుర్వేద సదస్సులు నిర్వహించుకోవడానికి తమకు 300 గజాల నుండి 500 గజాల వరకు ఒక వేదిక మాకు వసతి కల్పించాలని కోరగా అందుకు మేయర్ సుముఖత వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంపీకోప్స్ తెలంగాణ డైరెక్టర్ డా.వై. శ్రీనివాసులు, వరంగల్ స్టోర్ ఇంచార్జి యన్.శ్రీనివాసరావు డా.జగదీశ్వర ప్రసాద్,డా.రమేష్ బాబు,డా.లింగమూర్తి,డా.ప్.వీరా రెడ్డి,డా.సాంబ మూర్తి ప్రముఖ వ్యాపారవేత్త మాదారపు రాజేశ్వరరావు టిఆర్ఎస్ లీడర్ మల్యాల వీరమయ ప్రభాకర్‌రావు ఉపాధ్యాయుడు, తదితరులు పాల్గొన్నారు.