జ‌య జ‌య‌హే మ‌హిషాసుర మ‌ర్దిని...

జ‌య జ‌య‌హే మ‌హిషాసుర మ‌ర్దిని...
* భ‌క్తుల పాలిట కొంగుబంగారం బెజ‌వాడ దుర్గ‌మ్మ‌
* నేటి నుంచి ప్రారంభం కానున్న ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు 
* ద‌శావ‌తారాల‌లో భ‌క్తుల‌కు ప‌దిరోజుల పాటు క‌న‌క‌దుర్గ‌మ్మ సాక్షాత్కారం
( కారం దైత్య‌నాశ‌కం. *ఉ* కారం విష్ణు నాశ‌కం. *ర్‌* కారం రోగ నాశ‌కం. *గ‌* కారం పాప నాశ‌కం, *ఆ* భ‌యనాశ‌క వాచ‌కం. అందుకే ఆ "దుర్గా మాత నామాన్ని ఉచ్ఛ‌రించినా, స్మ‌రించినా స‌ర్వ పాపాలూ న‌శిస్తాయి. అమ్మ‌వారికి ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు చాలా ప్రీతిక‌ర‌మైన‌వి. ఈ ప‌ది రోజులూ బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌శావ‌తారాల‌లో భ‌క్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమై సాక్షాత్క‌రిస్తుంది. ఇంద్ర‌కీలాద్రిపై దుర్గ‌మ్మ స‌న్నిధిలో ద‌స‌రా వేడుక‌ల‌ను ఈ ఏడాది కూడా రాష్ట్ర పండుగ‌గా ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుంది.  బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు ఏటా వైభ‌వంగా జ‌రుగుతుంటాయి. క‌నీసం 15ల‌క్ష‌ల మంది భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారు. ఉత్స‌వాల ముగింపు సంద‌ర్భంగా విజ‌య‌ద‌శ‌మి రోజున దుర్గాదేవిని హంస‌వాహ‌నంపై ఊరేగిస్తారు. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే ఈ తెప్పోత్స‌వాన్ని చూసేందుకు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. జై భ‌వానీ.. జైజై జ‌గ‌జ్జ‌న‌నీ...! 
                        ప‌ర‌మ దుర్మార్గుడైన మ‌హిషాసురుడి బారినుంచి దేవ‌త‌ల‌నూ మ‌నుషుల‌నూ ర‌క్షించేందుకు ఘోర యుద్ధం చేసి అత‌డిని వ‌ధించింది దుర్గాదేవి. ఆ స‌మ‌యంలో మ‌హోగ్రంగా క‌నిపిస్తున్న ఆ త‌ల్లిని చూసిన దేవ‌త‌లంద‌రూ *అమ్మా నీవు లోకాల‌ను ర‌క్షించే త‌ల్లివి .. ఇంత‌టి ఉగ్ర రూపం మ‌హిషాసురుని వంటి రాక్ష‌స‌వ‌ధ‌కే గానీ మేమెట్లు భ‌రించ‌గ‌లం, శాంత రూపిణివై లోకాల‌ను కాపాడ‌మ‌ని* వేడుకున్నారు. అప్పుడా త‌ల్లి క‌రుణార‌స సంపూర్ణ అయిన రాజ రాజేశ్వ‌రీ దేవిగా అవ‌త‌రించింది. నాటి నుంచి ప్ర‌తి సంవ‌త్స‌ర‌మూ ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి మొద‌లు న‌వ‌మి వ‌ర‌కూ జ‌రిగే శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాల‌లో న‌న్ను ఆరాధించిన వారికి ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాలూ, సుఖ శాంతులూ క‌లుగుతాయ‌ని వ‌ర‌మిచ్చింది. అయితే అనంత రూపిణి అయిన అమ్మ‌వారిని ఏ రూపంలో అర్చించాలీ అని మార్క‌డేంయ మ‌హ‌ర్షికి ఓ సందేహం వ‌చ్చింది. నేరుగా బ్ర‌హ్మ‌దేవుడిని క‌లిశాడు. దాంతో సాక్షాత్తూ సృష్టిక‌ర్తే న‌వ‌దుర్గా రూపాల‌ను వ‌ర్ణించాడు. జ‌గ‌న్మాత స‌క‌ల చ‌రాచ‌ర జ‌గ‌త్తును సృష్టించేందుకు శ్రీదుర్గ‌, మ‌హాల‌క్ష్మీ, స‌ర‌స్వ‌తి, గాయ‌త్రి, శార‌దాదేవి రూపాల‌ను ధ‌రించింది. ఈ పంచ రూపాల‌లో అది ప్ర‌కృతిస్వ‌రూపం క‌నుక దుర్గ‌మ్మ మహిషాసురుణ్ని స‌హ‌రించిన త‌రువాత ప‌విత్ర కృష్ణా తీరంలోని ఇంద్ర‌కీలాద్రిపై స్వ‌యంభువుగా అవ‌త‌రించింది. సాధార‌ణ రోజుల్లో కంటే ఈ ప‌ది రోజుల్లో క‌న‌క‌ప్ర‌భ‌ల‌తో వెల‌సిన దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు కోటి రెట్లు పుణ్యం ద‌క్కుతుంద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image