సుప్రీం కోర్టు జడ్జీలుగా నలుగురు ప్రమాణ స్వీకారం

సుప్రీం కోర్టు జడ్జీలుగా నలుగురు ప్రమాణ స్వీకారం          ఢిల్లీ : సుప్రీం కోర్టు జడ్జీలుగా జస్టిస్‌ క్రిష్ణమురారీ, జస్టిస్‌ శ్రీపతి రవీంద్ర భట్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణ్యన్‌, జస్టిస్‌ హృషికేశ్‌రావులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య 34 కు చేరుకుంది. కొత్త న్యాయమూర్తుల రాకతో సుప్రీం కోర్టులో మరో రెండు కోర్టు హాళ్లను ఏర్పాటు చేశారు. 16, 17 కోర్టు హాళ్లను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఈ రోజు నుంచి 16 ధర్మాసనాల్లో కేసుల విచారణ జరుగుతుంది