ఉత్సవాల ఏర్పాట్లు లో ఈవో వైఫల్యం :పోతిన వెంకట మహేష్

దసరా ఉత్సవాల నిర్వహణకోసం శాఖల  మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతుంది,
         ఈవో గారికి  కాంట్రాక్టులు  ,   కమిషన్ల , మీద ఉన్న శ్రద్ధ భక్తుల సదుపాయాలు ఏర్పాట్ల మీద లేదు,
ఇతర దేవాలయాల నుంచి ట్రాన్స్ఫర్ మీద వచ్చిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ప్రమోషన్లు ఇస్తారు.
                            ఉత్సవాల ఏర్పాట్లు లో ఈవో వైఫల్యం.
 
     విజయవాడ సెప్టెంబర్ 27 (అంతిమ తీర్పు):     దసరా ఉత్సవాల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి పరిశీలించేందుకు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శనీశ్వరుడి దేవస్థానం వద్ద  ఏర్పాటుచేసిన తాత్కాలిక కేశఖండన శాల ను, సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటుచేసిన జల్లు స్నానాల ఏర్పాట్లను, క్యూ లైన్లను, కనకదుర్గ నగర్ వద్ద ఉన్న రోడ్లను, పారిశుద్ధ్య ఏర్పాట్లను, ప్రసాద పంపిణి కేంద్రాలను మరియు ఉచిత అన్నప్రసాద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా కేశఖండన శాల వద్ద ఏర్పాట్లు లేవని, జల్లు స్నానాల వద్ద భద్రతా చర్యల్ని అధికారులు గాలికొదిలేశారని, ఏ మాత్రం కొద్ది గా భక్తుల రద్దీ ఉన్న నదిలోకి జారి పడే ప్రమాదం పొంచి ఉందని, అదేవిధంగా క్యూలైన్ల పై భాగంలో ఏర్పాటు చేయాల్సిన పైకప్పు ఇంత వరకు ఏర్పాటు చేయలేదని, పారిశుధ్య ఏర్పాట్లు అధ్వానంగా ఉన్నాయని, కనక దుర్గ నగర్ లో రోడ్లపై గోతులు కూడా సరిగ్గా పూడ్చలేదని, మహిళా భక్తులకు దుస్తులు  మార్చుకునేందుకు అనుగుణంగా కనీసం రూములు కూడా ఏర్పాటు చేయలేదని, దుర్గ గుడి ఈవో గారికి  కాంట్రాక్టులు  మీద కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ  దసరా ఉత్సవాల  ఏర్పాట్ల పై ఏమాత్రం లేదని, శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనపడుతుంది అన్నారు.ఉత్సవాల ఏర్పాట్లు లో ఈవో వైఫల్యం చెందరన్నారు. ఇతర దేవాలయాల నుండి  అమ్మవారి దేవాలయానికి ట్రాన్స్ఫర్ పై వచ్చిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ప్రమోషన్లు ఇస్తారో సమాధానం చెప్పాలని ఇది పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ రూల్స్ కి విరుద్ధమని మహేష్ ఈవోని  హెచ్చరించారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో ఉపముఖ్యమంత్రి  మరియు   వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు గారు  ఏర్పాట్లను పరిశీలిస్తున్న సమయంలో మహేష్ ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి  సమస్యలను తెలియజేయగా వారు సానుకూలంగా స్పందించి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని  హామీ ఇచ్చినారు.ఈ కార్యక్రమాo లో పిల్లా. శ్రీనివాసరావు, వెన్న. శివ శంకర్, సిహెచ్ .కృష్ణ, పుల్లారావు, రాఘవ , గన్ను. శంకర్ , బత్తుల వెంకటేష్, శివ, గట్టుపల్లి .సంతోష్ కుమార్, సోము .గోవింద్ ,తమ్మిన లీలా కరుణ కుమార్, రాజా నాయుడు , రేఖపల్లి. సీను, దాసరి దుర్గా భవాని , దుర్గా రాణి తదితరులు  పాల్గొన్నారు.