రాయపూడి పరిసరాల నుంచి అక్రమంగా గుంటూరుకు రవాణా

ఇసుక ధరాభారం
ట్రాక్టర్‌ రూ.7,500.. లారీ రూ.16 వేలు
ధర దిగి వచ్చేది ఎప్పుడు?
రాయపూడి పరిసరాల నుంచి అక్రమంగా గుంటూరుకు రవాణా
ప్రేక్షకపాత్ర వహిస్తున్న యంత్రాంగం
గుంటూరు : ఇసుక ధర కిందికి దిగి రావడం లేదు. ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నూతన విధానంతో ధర తగ్గాల్సిందిపోయి రోజు రోజుకు మరింత పెరుగుతోన్నది. కృష్ణానదికి వరద కారణంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయని ప్రభుత్వం ఒకవైపు చెబుతుండగా మరోపక్క రాయపూడి పరిసర ప్రాంతాల నుంచి డ్రెడ్జర్లు పెట్టి ఇసుకని తోడి పారేస్తున్నారు. అదే ఇసుకని జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి ట్రాక్టర్‌ అయితే రూ.7,500, లారీ అయితే రూ.16 వేలకు విక్రయిస్తున్నారు. అసలే నిర్మాణాలు మూడు నెలలకు పైగా నిలచిపోయి ఉండటంతో మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తూ చాలామంది అధిక ధరకే ఇసుకని కొనుగోలు చేస్తున్నారు.
చెలరేగిపోతున్న ఇసుక మాఫియా : కృష్ణానదికి గత కొద్ది రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రీచ్‌లన్నింటిలోకి వరదనీరు వచ్చి చేరడంతో అక్కడ ఇసుక తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు నిలిచాయి. ఇదే అదనుగా రాయపూడిలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అధికార పార్టీ నేతల అండదండలతో పేట్రేగిపోతోంది. రాయపూడి, బోరుపాలెం, ఉద్ధండ్రాయునిపాలెంలోనూ ప్రస్తుతం వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మనుషులు వెళ్లి ఇసుక తోడటం వీలు కాదు. పైగా అక్కడ ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. అయినప్పటికీ జిల్లా కేంద్రానికి అక్కడినుంచే ఇసుక రవాణ జరుగుతోంది. ఇప్పుడొచ్చే ఇసుక నాణ్యతతో కూడుకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో మాఫియా సొమ్ము చేసుకొంటోంది. అమరావతి రోడ్డులో ఇసుక ట్రాక్టర్లు, లారీలు యథేచ్ఛగా తిరుగుతున్నా వాటికి అడ్డుకట్ట వేసే పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు కరువయ్యారు.
జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలి : ఇదిలావుంటే కృష్ణానదికి వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అధికారిక స్టాక్‌ పాయింట్ల నుంచి ఇసుక విక్రయాలు ఇప్పుడప్పుడే పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అధిక ధరకి అయినా ఇసుక లభ్యం అవుతుండటంతో చాలామంది భవన యజమానులు రాయపూడి నుంచి వచ్చే ఇసుక కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పేద ప్రజలు మాత్రం అంత ధర పెట్టి ఇసుక కొనుగోలు చేయలేక తమ నిర్మాణాలను ఇంకా పునఃప్రారం భించుకోలేకపోతున్నారు. అమరావతిలో రద్దు అయిన ఇసుక టెండర్లకు తిరిగి రివర్స్‌ ఆక్షన్‌ నిర్వహించినప్పటికీ ఇంకా కాంట్రాక్టర్‌ని ఖరారు చేయలేదు. ఇది కూడా ఇసుక ధర ఆకాశాన్ని అంటడానికి కారణంగా నిలుస్తోంది. గ్రామ సచివాలయాల ఏర్పాటు, అభ్యర్థుల నియామక ప్రక్రియలో బిజీగా ఉన్న అధికారులు ఇసుక గురించి పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్‌గా కోన శశిధర్‌ ఉన్న సమయంలో ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Popular posts
87-88 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల కలయిక
Image
*పేదలకు వరప్రసాదినిలా 108, 104 సేవలు* తిప్పిరెడ్డి.నారపరెడ్డి..... వింజమూరు, జూలై 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం లాంచనంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్సు వాహనాలు పేద వర్గాల ప్రజలకు వరప్రసాదినిగా మారనున్నాయని మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 108, 104 సేవలను విస్తరించనున్నామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపధ్యంలో దాదాపుగా 201 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి 1088 అంబులెన్సు వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్ కూడలి వద్ద ప్రారంభించడం అభినందనీయమని నారపరెడ్డి కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాడు ఆరోగ్యశ్రీతో పాటు 108 వాహనాలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కాలక్రమేణా 108 వాహనాల వ్యవస్థ మరుగున పడి వాటి మనగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలో పయనిస్తూ ఒకేసారి 1088 అంబులెన్సు వాహనాలను ప్రజలకు సేవ చేసేందుకు ప్రారంభించి అటు తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఇటు ఆపదలలో ఉన్నవారికి ఆపద్భాంధవునిలా నిలిచారన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ అంబులెన్సు వాహనాలు త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయించనున్నారని నారపరెడ్డి తెలియజేశారు. ప్రజల సం క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పధకాలతో పాటు అదనంగా కొత్త పధకాలకు శ్రీకారం చుడుతుండటం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజల సం క్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న సి.యం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తిప్పిరెడ్డి.నారపరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Image
హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS
Image
చనిపోయాక కూడా ఆవ్యక్తికి మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారమా?
గుండెపోటుతో మరణించిన వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం: సీఎం  వైయస్.జగన్
Image