అంతిమతీర్పు. 29-09-2019
ఐఐఐటీ-శ్రీసిటీ విద్యార్ధుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన
శ్రీసిటీ, సెప్టెంబర్ 29, 2019: ఐఐఐటీ-శ్రీసిటీ విద్యార్ధులు నేషనల్ సర్వీస్ స్కీం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్హహించారు. శ్రీసిటీ ఎక్స్ప్రెస్ హైవే లోని జ్ఞాన్ మార్గ్ కూడలి వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు.
ఐఐఐటీ డైరక్టర్ ప్రొఫ్. కన్నభిరాన్ కార్యక్రమాని ప్రారంభించి, వాహనం నడిపేవారు తీసుకొన వలసిన జాగ్రత్తలు, విధిగా పాటించాల్సిన నియమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం గురించి ప్రసంగించారు.
విద్యార్ధులు ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్లపై కనిపించే పలు సూచిక బోర్డుల గురించి, హెల్మెట్ల వాడకం యొక్క ఆవశ్యక్త, సీట్ బెల్టుల ఉపయోగం వగైరా వాహన చోదకులకు వివరించారు. హెల్మెట్ పెట్టుకున్న వాహన చోదకులకు చాక్లేట్లు పంచి అభినందనలు తెలిపారు.
ఫొటోలు:
1. విద్యార్ధులతో ఐఐఐటీ డైరక్టర్ ప్రొఫ్. కన్నభిరాన్
2. కార్యక్రమంలోంపాల్గొన్న విద్యార్ధులు
3. వాహన చోదకునకు చాక్లేట్లు పంచి అభినందనలు తెలుపుతున్న విద్యార్ధిని