మీడియాపై పోలీసుల ఆంక్షలు

మీడియాపై పోలీసుల ఆంక్షలు
గుంటూరు : జిల్లాలో రాజకీయ వేడికి, తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన బుధవారం నాటి టీడీపీ 'ఛలో ఆత్మకూరు'ను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. టీడీపీ శిబిరం వద్ద నుంచి మీడియాను బలవంతంగా బయటకు పంపివేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సహా ముఖ్యనేతలందరినీ ఎక్కడికక్కడ ముందు జాగ్రత్తచర్యగా హౌస్‌ అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మంగళవారం రాత్రి శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ముందస్తు అరెస్టు కోసం చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 'చలో ఆత్మకూరు' నిర్వహించాలని.. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను, అరాచకాలను రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపాలని కృతనిశ్చయంతో ఉన్న టీడీపీ అధిష్ఠానం పోలీసు చర్యలను ముందే పసిగట్టింది. పార్టీ ముఖ్య నేతలందరినీ రాత్రికి రాత్రే గుంటూరులోని వైసీపీ బాధితుల పునరావాస శిబిరానికి రావాలని ఆదేశించింది. పోలీసులను ప్రతిఘటించి బాధితులతో కలిసి ఆత్మకూరుకు వెళ్లితీరాలని టీడీపీ పట్టుదలతో ఉండగా.. నేతలందరినీ శిబిరం వద్దే హౌస్‌ అరెస్టు చేయడం సులభమవుతుందని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వందలాది పోలీసులను మంగళవారం ఉదయమే రంగంలోకి దింపారు. రాత్రికల్లా వారి సంఖ్యను మరింత పెంచారు.


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
పౌష్ఠిక ఆహారం అందజేత
Image
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Image