1,04,317 మంది లబ్ధిదారులను గుర్తించాం : జిల్లా కలెక్టర్ 


💐ఉగాది నాటికి ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం 
💐జిల్లాలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి 1,540 గ్రామాలలో 1,04,317 మంది లబ్ధిదారులను గుర్తించాం : జిల్లా కలెక్టర్ 


తిరుపతి, సెప్టెంబర్ 25: జిల్లాలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి 1,540 గ్రామాలలో 1,04,317 మంది లబ్ధిదారులను గుర్తించామని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. బుధవారం ఉదయం తిరుపతి ఎస్.వి యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు కార్యక్రమం పై నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉగాది నాటికి ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని దాదాపు గా 4 నెలల నుండి స్పెషల్ డ్రైవ్ కింద 11.4 లక్షల హౌస్ హోల్డ్స్ ను 1043 రెవెన్యూ గ్రామాల్లో గుర్తించామని నియోజకవర్గాల వారీగా మరియు హ్యాబిటేషన్ ల వారీగా కూడా వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించడం జరుగుతూ ఉందని తెలిపారు. తిరుపతి అర్బన్, శ్రీ కాళహస్తి ప్రాంతాలలో ప్రభుత్వ భూమి తక్కువగా ఉన్నదని కలెక్టర్ మంత్రుల దృష్టికి తీసుకుని వచ్చారు. 


 తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను పేదలకు చేర్చుటకు నిబద్దతతో పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని, ఆచరణీయమైన పథకాలతో అర్హులైన లబ్ధిదారులకు నిజమైన మేలు చేకూరేలా కృషి చేస్తున్నామని, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. 


 చిత్తూరు శాసన సభ్యులు ఏ.శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గంలో ఉగాది నాటికి ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి 100 ఎకరాలు అవసరం కాగా 50 ఎకరాలు కలదని మరో 50 ఎకరాలను భూ సేకరణ చేసి అయినా పేదవారికి మేలు చేకూర్చేలా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు.


 సత్యవేడు శాసన సభ్యులు ఆదిమూలం మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్న ఈ ప్రభుత్వం పరిపాలన లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నదని, అనేక గ్రామాలలో స్మాసన వాటికలు ఏర్పాటు చేయాలని మంత్రి ని కోరారు. 


 పీలేరు శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పీలేరులో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు ఎక్కువగా కలవని వీటిని తొలగించాలని, చుక్కల భూముల పై ఎక్కువ సమస్యలు వస్తున్నాయని వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, భూ సేకరణ చేసేందుకు కూడా డబ్బులు లేనందున ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. అలాగే ఇండ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ ను పెంచాలని మంత్రిని కోరారు. 


 మదనపల్లె శాసన సభ్యులు నవాజ్ బాషా మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి కబ్జా కాబడినదని, దీని తొలగింపునకు చర్యలు చేపట్టాలని మరియు మదనపల్లె జనాభా ఎక్కువగా ఉన్నందున మదనపల్లె అర్బన్, రూరల్ కు ప్రత్యేక తహశీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేయవలసిందిగా మంత్రిని కోరారు. 


 పీలేరు, మదనపల్లె శాసన సభ్యులు ప్రభుత్వ భూమి ఆక్రమణల పై రెవెన్యూ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు స్పందిస్తూ ప్రత్యేక రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి వెంటనే ఆక్రమణనాలను తొలగించేందుకు సర్వే ప్రక్రియ చేపట్టాలని మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి ని ఆదేశించారు. 


 తంబళ్ళపల్లె శాసన సభ్యులు ద్వారకానాథ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతమైన తంబళ్ళపల్లె నియోజకవర్గంలో అర్హులైన పెదలందరికీ ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించి న్యాయం జరగాలని తెలిపారు. హంద్రీ – నీవా జలాలను అన్ని చెరువులకు నింపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 
 రెవెన్యూ శాఖకు ప్రోటోకాల్ విధులు, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నదని రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ విజయసింహా రెడ్డి మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సమీక్ష సమావేశం లో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ సంబంధిత అంశాల పై తహశీల్దార్ లతో సమీక్షించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ డి.మార్కండేయులు ఇంత వరకు జిల్లా లో ఉగాది నాటికి ఇండ్ల పట్టాల పంపిణీకి సంబంధించి సేకరించిన భూమి వివరాలను మంత్రులకు వివరించారు.   
 
 ఈ సమావేశం లో తిరుపతి ఆర్ డి ఓ కనక నరసారెడ్డి, చిత్తూరు ఆర్ డి ఓ డా. రేణుక, హౌసింగ్ ఇంచార్జ్ పి డి నాగేశ్, జిల్లా లోని డిప్యూటీ కలెక్టర్ లు, తహశీల్దార్లు, డిటి లు, హౌసింగ్ అధికారులు, సర్వేయర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.  


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం