ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత

29–09–2019
అమరావతిబొగ్గు కొరతపై 


• ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత
• సుమారు 57శాతానికి పైగా తగ్గిన సరఫరా
• మహానది బొగ్గుగనులనుంచి పడిపోయిన సరఫరా
• ప్రమాదం, సమ్మెలు, భారీ వర్షాలే కారణం
• సింగరేణిలో కూడా వర్షాల కారణంగా తగ్గిన ఉత్పత్తి
• జెన్ థర్మల్ విద్యుత్ కేంద్రాలపై తీవ్ర ప్రభావం
• డొంకరాయి– దిగువ సీలేరులో ఆగస్టులో పవర్ కెనాల్‌కు గండి
• పునరుద్ధరణ పనులకు భారీ వర్షాలతో ఆటంకం
• మరోవైపు నవంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకూ ఇతర రాష్ట్రాల నుంచి అప్పుగా కరెంటు 
• జూన్ 15,2019  నుంచి అప్పు తీరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సెప్టెంబరు 30తో పూర్తి
• పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తికోసం రంగంలోకి రాష్ట్ర ప్రభుత్వం
• సింగరేణి నుంచి ఉత్పత్తి పెంచాలంటూ తెలంగాణ సీఎంకు ఏపీ సీఎం శ్రీ వైయస్.జగన్ విజ్ఞప్తి
• కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకూ ముఖ్యమంత్రి లేఖ
• కేంద్ర ప్రభుత్వంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న ఏపీ భవన్ అధికారులు


• రాష్ట్రంలో థర్మల్‌విద్యుత్ కేంద్రాల కరెంటు ఉత్పత్తి సామర్థ్యం 5010 మెగావాట్లు. బొగ్గు సరఫరాకోసం మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్), సింగరేణి ( ఎస్సీసీఎల్) సంస్థలతో థర్మల్ కేంద్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఏడాదికి 17.968  మిలియన్ మెట్రిక్ టన్నులు ఎంసీఎల్ సరఫరా చేయాల్సి ఉండగా, సింగరేణి సంస్థనుంచి 8.88 మిలియన్ మెట్రిక్ టన్నులు సరఫరాచేయాల్సి ఉంది. 


• గడచిన ఏడాది పీరియడ్‌లో 12679 మిలియన్ యూనిట్ల కరెంటును ఏపీ జెన్కో థర్మల్ సంస్థలు ఉత్పత్తి చేయగా, ఇప్పుడు 14062 మిలియన్ యూనిట్లు ఉత్పత్తిచేస్తున్నాయి. అంతేకాకుండా గత ఏడాది అదనంగా 11 లక్షల మెట్రిక్‌టన్నుల బొగ్గును వినియోగించారు.


• భరత్‌పూర్‌లోని ఎంసీఎల్లో జులై చివరి వారంలో ప్రమాదం చోటుచేసుకుంది. దీనిఫలితంగా కార్మికులు 15 రోజులుపాటు సమ్మె చేయడంతో ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాలకు రావాల్సిన బొగ్గు సరఫరాలో భారీగా కోత పడింది. మళ్లీ సెప్టెంబరు మూడోవారంలో ఎంసీఎల్లో మూడు రోజులు, సింగరేణిలో ఒకరోజు సమ్మె పాటించడంతో నిర్దేశించిన రీతిలో బొగ్గు థర్మల్ కేంద్రాలకు అందలేదు. బేస్‌లోడ్ పవర్ అందిస్తున్న థర్మల్ కేంద్రాల ఉత్పత్తిని ఈ పరిణామాలు దెబ్బతీశాయి.


• డొంకరాయి, దిగువసీలేరు మధ్య విద్యుత్ ఉత్పాదనకోసం ఉద్దేశించిన పవర్‌కెనాల్‌కు ఆగస్టు 12న భారీ వరద కారణంగా గండిపడింది. దీన్ని పునరుద్ధరించడానికి పనులు చేస్తున్నా, వర్షాల కారణంగా పనులు ముందుకు సాగడంలేదు. దీనివల్ల 300 నుంచి 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పనులను పూర్తిచేయడానికి ఏపీ జెన్కో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. 


• వీటితోపాటు మహానది కోల్ ఫీల్డ్స్లోనూ, ఇటు సింగరేణిలోనూ సెప్టెంబరు మాసంలో కుండపోతగా వానలు కురిశాయి. దీంతో ఏపీ జెన్కోకు అందాల్సిన బొగ్గు సరఫరా సక్రమంగా జరగడంలేదు. 


• జెన్ థర్మల్ సంస్థల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ( పీఎల్ఎఫ్) 85శాతానికి చేరుకోవాలంటే దాదాపు 70,000 మెట్రిక్‌టన్నుల బొగ్గు కావాల్సి ఉండగా, ప్రస్తుతం 45,000 మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే ఎంసీఎల్, సింగరేణి సంస్థలనుంచి అందుతోంది.


• బొగ్గు కొరతను తీర్చడానికి, సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి ఏపీ జెన్కో అధికారులు మహానది, సింగరేణి సంస్థల ప్రతినిధులతో నిరంతరం మాట్లాడుతున్నారు. వారితో సమన్వయం చేసుకుంటున్నారు. 


• సింగరేణి నుంచి సరఫరాను రోజుకు 4 ర్యాక్స్ నుంచి 9 ర్యాక్స్‌కు పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావుకు విజ్ఞప్తిచేశారు. 


• కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి లేఖ కూడారాశారు. ఒప్పందం ప్రకారం సరిపడా బొగ్గును సరఫరాచేయాలంటూ, బొగ్గు సరఫరాను పెంచడానికి ప్రత్యామ్నాయం చూడాలంటూ ఆలేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు. 


• అంతేకాక హర్యానా, పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్లనుంచి ఏపీ ప్రభుత్వం నవంబర్ 2018, డిసెంబర్ 2018, ఫిబ్రవరి 2019, మార్చి 2019, ఏప్రిల్ 2019 మాసాల్లో 3800 మిలియన్ యూనిట్ల రౌండ్ ది క్లాక్ (ఆర్టీసీ)
• విద్యుత్‌ను అప్పుగా తీసుకుంది. దీనికి ప్రతిఫలంగా 1500 మెగావాట్ల విద్యుత్‌ను జూన్ 15 నుంచి తిరిగి చెల్లిస్తోంది. సెప్టెంబరు 30తో ఇది ఈ విద్యుత్ చెల్లింపు ప్రక్రియ ముగుస్తుంది. 


• విద్యుత్కంపెనీలనుంచి కరెంటు కొనుగోళ్లకోసం గతంలో అడ్వాన్స్‌ల స్థానంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ వ్యవస్థను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తున్న కెఎస్కే థర్మల్ పవర్‌ప్లాంట్ తనకు చాలారోజుల నుంచి చెల్లింపులు చేయడంలేదంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. సెప్టెంబరు 30లోగా దీన్నికూడా పరిష్కరిస్తుంది. 


• పై అన్ని చర్యల ద్వారా తిరిగి విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తికోసం ఏపీజెన్కోతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image