ప్రత్యామ్నాయమే దిక్కు


కడప : వరుణుడు కరుణ చూపకపోవడంతో ఖరీఫ్‌ సీజన్‌ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నో ఆశలతో వ్యవసాయశాఖ కూడా ఈ సీజన్‌లో భారీ సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు అటు రైతులు, ఇటు వ్యవసాయశాఖపై నీళ్లు చల్లింది. సాగు విస్తీర్ణంలో సాధారణ సాగులో కనీసం సగం కూడా ఆగస్టు చివరి నాటికి సాగు కాలేదు. ఆలస్యంగా చెదరుమదురు వర్షాలు పడడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయశాఖ కూడా రైతులకవసరమైన ప్రత్యామ్నాయ విత్తనాలను ఉచితంగా అందిస్తోంది. ఖరీఫ్‌లో రబీ సాధారణ విస్తీర్ణం 1,16,850 హెక్టార్లు అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆగస్టు చివరి నాటికి కేవలం 20,341 హెక్టార్లు మాత్రమే సాగయ్యాయి. ఇటీవల వర్షాలు పడకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలైన ఉలవ, పెసర, మినుము, జొన్న, ఆముదం తదితర పంటలు వేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందుకు 11,023 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
32 మండలాల్లో : ఆగస్టు రెండవ వారం నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి ప్రత్యామ్నాయ పంటల సాగు ఆశలకు ఊపిరిపోస్తున్నాయి. దాదాపు 25వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. జిల్లాలోని 32 మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేందుకు అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. 
ఉచితంగా విత్తనాలు : ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు వ్యవసాయశాఖ ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తోంది. ఐదు ఎకరాల పొలం ఉన్న రైతులకు సాగును బట్టి విత్తనాలను ఉచితంగా అందిస్తున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో ఉలవ సాగుకు అనుకూలంగా ఉండడంతో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె వ్యవసాయ డివిజన్లలోని 9 మండలాల్లో ఉలవ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. చక్రాయపేట మండలం, లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రాల్లో ఉలవలకోసం రైతులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. వందల సంఖ్యలో రైతులు రావడంతో గంటల తరబడి క్యూలలో ఉండాల్సి వచ్చింది. 4వేల క్వింటాళ్ల విత్తనాలు శుక్రవారం సాయంత్రానికి పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. మిగతా మండలాల్లో డిమాండ్‌ బట్టి ఆయా విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. పెసర 500 క్వింటాళ్లు, మినుము 350 క్వింటాళ్లు, ఉలవ 945, జొన్న 163, ఆముదం 35 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. వర్షాలు కురవడంతో విత్తనాల కోసం రైతులు ఎగబడుతున్నారు. అయితే ఐదెకరాలున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం విత్తనాలు అందిస్తోంది. ఐదు ఎకరాలు సీలింగ్‌ లేకుండా అవసరమైన విత్తనాలు అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image