సెప్టెంబర్ 3నుంచి తెదేపా ప్రత్యక్ష కార్యాచరణ

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ గ్రామాల్లో తెదేపా కార్యకర్తల పై దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ఇళ్లపై దాడులు చేస్తున్నారు, భూములు సాగు చేయనివ్వకుండా అడ్డం పడుతున్నారు. గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. ఈ కారణంగా అనేక మంది కార్యకర్తలు ఊళ్ళు విడిచి వెళ్ళారు. 
మనది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం. పౌరులు అందరికీ నివసించే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాసే అధికారం వైసీపీ వాళ్ళకు ఎవరిచ్చారు? అందుకే వైసీపీ వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3నుంచి తెదేపా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది. 
మంగళవారం నుంచి గుంటూరులో వైసిపి బాధితుల పునరాశ్రయ శిబిరం ప్రారంభిస్తోంది.  
పల్నాడుతో సహా ఇతర ప్రాంతాల బాధితులందరికీ ఈ శిబిరంలో  ఆశ్రయం కల్పిస్తుంది. రక్షణ ఇస్తుంది. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా శిబిరాల్లోనే బాధితులు ఉంటారు. ఆ తర్వాత తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా దగ్గరుండి బాధితులను ఆయా గ్రామాలకు తీసుకుని వెళ్తారు. బాధితులు అందరికీ న్యాయపరంగా రక్షణ కల్పిస్తారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image