- Nandyala - Kurnool - 28-9-19 -
* నంద్యాల ; రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భూ రికార్డుల ప్రక్షాళన, స్వచ్చీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది..రెవెన్యూ శాఖలో జమాబందీ వ్యవస్థ ను తిరిగి చేపడతాం: డిప్యూటీ సిఎం మరియు రెవెన్యూ మంత్రి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్*
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ పథకాలు, కార్యక్రమాలపై కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్ సెంటినరీ హాల్ లో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జెసి రవి పట్టన్ శెట్టి, రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్న డిప్యూటీ సిఎం శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్, హౌసింగ్ మంత్రి శ్రీరంగనాథరాజు, ఫైనాన్స్ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. పాల్గొన్న ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తదితరులు.
*రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తద్వారా భూ సమస్యల పరిష్కారం సులభమవుతుందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు**
1983 లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల
రాష్ట్రంలో అస్తవ్యస్తంగా తయారైన భూ రికార్డులను ప్రక్షాళన చేయడానికి, 1983 సంవత్సరానికి ముందున్న పద్ధతిని మళ్లీ తీసుకు రావాలనే ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు
ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ సిస్టమ్స్ వల్ల, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టక పోవడం వల్ల భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని భూ యజమానులకు, రెవెన్యూ అధికారులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆక్టోబరు 2 నుంచి భూములు రీసర్వే చేయడానికి 11 వేల మంది సర్వేయర్లను సర్కారు నియమించనున్నట్లు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
ఈ ఉగాది నాడు రాష్ట్రంలో నిరుపేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ లక్ష్యం గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా గ్రామ స్థాయి విఆర్వో నుండి మండల తాహసీల్దార్లు, సర్వేయర్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి కలెక్టర్, జేసీ వరకు సర్వే, రెవెన్యూ అధికారులందరూ కృషి చేసి ఒక్క ఎకరా కూడా తేడా రాకుండా భూ రికార్డుల స్వచ్చీకరణకు, నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదేశించారు
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో నిరుపేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉందని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీరంగనాథ రాజు తెలిపారు.
అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని...ఒకేసారి లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని మంత్రులు పేర్కొన్నారు
అనంతరం, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జెసి రవి పట్టన్ శెట్టి లు పిపిటి ద్వారా జిల్లా రెవెన్యూ రికార్డుల వివరాలను, ఇంటి పట్టాల పంపిణీ కోసం గుర్తించిన
భూమి వివరాలను డెప్యూటీ సీఎం మరియు రెవెన్యూ మంత్రి గారికి వివరించారు