నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది

 


 గుంటూరు అర్బన్ పరిధిలో పోలీసు ప్రచార రధం ద్వారా లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం గురించి ప్రజలలో అవగాహన పెంచేందుకు గుంటూరు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి రామకృష్ణ,   తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది.


లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం విభాగం ఆర్బను పోలీసు కంట్రోలు రూమ్ నందు 24 గంటలు సిబ్బంది అందుబాటు లో అప్రమత్తంగా ఉంటారు. సిస్టం ద్వారా సమాచారం రాగానే సంబంధిత పోలీస్ సిబ్బంది /  అధికారులను అప్రమత్తం చేస్తూ, ఎల్.హెచ్.ఎం.ఎస్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుంటారు.


గుంటూరు అర్బన్ పరిధిలో నివసించేవారు ఎవరైన ఈ ఎల్.హెచ్.ఎమ్.ఎస్ నందు
రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా సులభం.


అట్టివారు తొలుత ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ LHMS యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. 
మీరు ఉండే ఇంటి వద్ద నుండి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి


న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేయగానే , ఓపెన్ అయి  వివరాలు కోరుతుంది. అప్పుడు వివరాలు నమోదు చేయగానే మీ  ఫోన్ కు ఓటీపీ వస్తుంది ,ఆ ఓటీపీ నమోదు చేయగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి   మీ ఫోన్ కు యూజర్ ఐడి వస్తుంది అది శాశ్వతముగా ఉంటుంది  ,
అట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు, తాము ఏదైనా ఊరు వెళ్ళే సందర్భంలో, తమ ఇంటిని నిఘాలో ఉంచుట కొరకు తిరిగి LHMS యాప్ ని ఓపెన్ చేసి , రిక్వెస్ట్ వాచ్ ఆప్షన్  ను క్లిక్ చేయవలసి ఉంటుంది. 


అప్పుడు దానిలో మీ యూజర్  ఐడి  నమోదు పరచి  ఎప్పటి నుండి ఎప్పటి వరకు వారి ఇంటిని నిఘాలో ఉంచాలో మొదలైన వివరాలు పూర్తి చేయగానే LHMS సిబ్బంది ఆ ఇంటికి చేరుకొని ,  ఇంటిని పరిశీలించి విలువైన వస్తువులు ముఖ్యమైన గదుల్లో సీసీ కెమెరాలను ఫిక్స్ చేయడం మొదలైన పనులు పూర్తి చేస్తారు.
 తరువాత గృహస్తులు వెళ్లి పోయి వారి పనులు చూసుకొని వచ్చే వరకు ఆ యొక్క ఇంటిని వాచ్ లో ఉంచుతారు.


 ఏదైనా ఇంకా కొన్ని రోజులు పాటు ఇంటికి రావటం వారికి కుదరక పోయినప్పుడు వాచ్ చేసే సమయాన్ని పెంచుకొనే వీలు కూడా దీనిలో ఉంటుంది.


ఈ లోపు పోలీస్ వారు ఆ ఇంటిని  గమనిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఇంటిలోనికి ఎవరైనా దొంగలు ప్రవేశించగానే ఆటోమేటిక్ గా కెమెరాలు అన్ని కదలికలను రికార్డు చేస్తాయి. అంతేకాకుండా అలారం మ్రోగుతుంది. అలారం మ్రోగగానే షిఫ్ట్ సిస్టమ్ లో పనిచేస్తున్న ఎల్.హెచ్.ఎం.ఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్  విద్యాసాగర్  , కానిస్టేబుల్స్  గోపికృష్ణ  , వీర్రాజు లు సంబంధిత ఏరియాలో ఉన్న పోలీస్ సిబ్బందిని /  సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడం జరుగుతుంది. వారు తక్షణమే అక్కడకు చేరుకొని సదరు ఇంటిని చుట్టుముట్టి అందు లోకి వచ్చిన దొంగలను పట్టుకోవడం జరుగుతుంది.


ఈవిధంగా ది.16.11.2018 వ తేదీన పాత గుంటూరు పరిధిలో LHMS ఏర్పాటు చేసిన ఒక ఇంటిలో చోరీ చేయుటకు ప్రవేశించిన  తాళ్లూరి దేశాయ్  అనే దొంగను  దొంగతనం చేయుచుండగా పోలీసు వారు చుట్టుముట్టి పట్టుకొని ముద్దాయిని కటకటాల వెనక్కి పంపినారు.


 పోలీస్ శాఖ ఉచిత LHMS సేవలు అందిస్తున్నందున ప్రజలందరూ ఈ సౌకర్యంను ఉపయోగించుకొని తమతమ ఇళ్లలో దొంగతనములు జరక్కుండా నివారించుకో వలసినదిగా అర్బన్ ఎస్పీ  రామకృష్ణ తెలిపారు.


 గుంటూరు అర్బన్ నందు ది.13-08-2017 వ తేదీన ఎల్.హెచ్.ఎం.ఎస్ ప్రారంభించడం జరిగింది. ఈనెల మొదటి వారంలో   గుంటూరు అర్బన్ ఎస్పీ  పి.హెచ్.డి రామకృష్ణ,ఐపిఎస్., ఇటీవల కంట్రోల్ రూమ్ లోని ఎల్.హెచ్.ఎం.ఎస్ విభాగ పనితీరును పరిశీలించి PCR లోని ఒక ఎస్సైని మరియు ఒక కానిస్టేబుల్ని అర్బన్ పోలీస్ ప్రచార రధం టీముకు అను సంధానించి , వారు ప్రతిరోజు వీడియో మరియు ఆడియోల ద్వారా ప్రజలను అనేక విషయాలలో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఎల్.హెచ్.ఎం.ఎస్ సేవలు పోలీసుల ద్వారా ఉచితంగా అందించ బడతాయని , వాటిని  ప్రజలు పనులపై బయటికి వెళ్ళేటప్పుడు ఏవిధంగా ఉపయోగించుకొనాలో అవసగాహన కలుగ చేయ వలసిందిగా ఆదేశించారు. 


ఈ క్రమంలో పోలీస్ కంట్రోల్ రూమ్ సిఐ వీరానాయక్ గారి ఆధ్వర్యంలో మహిళా ఎస్సై భాగ్యలక్ష్మి , కానిస్టేబుల్ శ్రీనివాసరావు  హోమ్ గార్డులు రాజా, డ్రైవర్ నాగరాజు లు వారి వారి విధులతో పాటు ప్రతిరోజు గుంటూరు ఆర్భన్ పరిధిలో సమాజములో జరుగుచున్న వివిధ రకాలైన మోసాలకు , నేరాలకు సంబంధించిన , మత్తు పదార్ధాల వల్ల అనర్ధాలు, అత్యాచారాల నిరోధానికి మొదలైన విషయాలలో ఫీల్డ్ లెవెల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 


గత మూడు వారాలలో  దాదాపు 2000 మంది ప్రజలు ఎల్.హెచ్.ఎం.ఎస్ నందు నూతనంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. దానికి ముందు వరకు షుమారు 2000 మంది మాత్రమే రిజిస్ట్రేషన్స్ చేయించు కున్నారు.


 అనేకమంది వారివారి పనుల నిమిత్తం తమ ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు LHMS ద్వారా రిక్వెస్ట్ పెడుతుండటంతో ఎల్.హెచ్.ఎం.ఎస్ సిబ్బంది వారికి ఈ ఉచితసేవలు సక్రమంగా అందిస్తున్నారు.


 ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ సేవలు ఉపయోగించుకొని తమతమ ఇండ్లలో చోరీలు జరగకుండా ఉండేందుకు గుంటూరు అర్బన్ పోలీసులు అందజేస్తున్న LHMS సేవలు ఉపయోగించుకోవాలని , తద్వారా నేరాలు అరికట్టడంలో సహకరించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ  తెలియ జేశారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image