అరాచకం సృష్టికి చంద్రబాబు బృందం కుట్ర:డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

అరాచకం సృష్టికి చంద్రబాబు బృందం కుట్ర
- బడుగులకు ఉద్యోగాలొస్తే సహించలేకపోతున్నారు 
- కుల, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు 
-చంద్రబాబు, రాధా కృష్ణలపై క్రిమినల్ కేసులు పెట్టాలి 
- నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
అమరావతి, సెప్టెంబర్ 21 :-   దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన 4 నెలలోపే 1.25 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తే ఎవరైనా సంతోషిస్తారని అయితే దీనికి విరుద్ధంగా చంద్రబాబు, లోకేష్ మాత్రం ఎంతో బాధపడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎద్దేవా చేసారు.కులపిచ్చి సంఘానికి అంతర్జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబుకు, ఆయనకు వత్తాసుపలకే రాధాకృష్ణ కుఈ రాష్ట్రంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు ఉద్యోగాలు అందుకుంటుంటే సంతోషం కలుగుతుందని అనుకోవడం కూడా తప్పేనని వ్యాఖ్యానించారు.గ్రామ సెక్రటేరియట్‌ పరీక్షలు, ఇంత సజావుగా జరగడంతో బాబు, ఆయన వందిమాగధుల కడుపు కాలేలా చేసిందని ధ్వజమెత్తారు. సచివాలయ పరీక్షలు 
రాసిన అభ్యర్థుల్లో 22మందిలో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉండగా, మిగిలిన 21  మందిలో అనుమానాలు రేకెత్తించాలన్నది చంద్రబాబు ఆయనకు మద్దతునిస్తున్న పత్రికల  దిగజారుడు వ్యూహమని ఈ రాష్ట్రంలో అందరికీ అర్థం అయ్యిందని పేర్కొన్నారు.సచివాలయ ఉద్యోగ పరీక్షల విషయంగా చంద్రబాబు బృందం చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ శనివారం మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో చంద్రబాబు, లోకేష్, రాధాకృష్ణ లపై నిప్పులు చెరిగారు.22.5 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కు దరఖాస్తు చేసుకోవడం అందులోనూ ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారు దాదాపు 70 శాతం అర్హుల జాబితాలో ఉండటం చంద్రబాబు బృందానికి  సంతోషాన్ని కలిగించే అంశమని ఎవరైనా అనుకోరని చెప్పారు.ఇంత అద్భుత ఘట్టంలో ఒక బీసీ  మహిళ టాప్‌ ర్యాంకరుగా నిలవటం, పదేళ్లు  Appsc అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న వ్యక్తికి ఆమె భార్య కావడం,బాడుగ నేతలు అంటూ గతంలో దళితుల్ని, బీసీల్ని అవమానించిన పచ్చపత్రిక అధిపతి  బీసీ మహిళకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు వస్తే సంతోషిస్తాడని  కూడా ఎవరూ అనుకోరని పేర్కొన్నారు.అందులోనూ కులాలవారీగా తీసుకుంటే లక్షకు పైగా బీసీలు, 64వేలకు పైగా ఎస్సీలు, 10వేలకు పైగా ఎస్టీలు ఈ ఉద్యోగాలకు అర్హత సాధించడం రాష్ట్రంలో సామాజిక చరిత్రనే మలుపులు తిప్పే అంశమని గుర్తు చేసారు.దేశచరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా గ్రామంలో పనులన్నీ గ్రామంలోనే అయిపోతుంటే అలాంటి వ్యవస్థకు మద్దతుగా ఈ రాధాకృష్ణ ఒక్క సంపాదకీయంగాని, ఒక్క వార్తగాని రాస్తాడని ఎవరన్నా అనుకుంటారా? అని పుష్ప శ్రీవాణి ప్రశ్నించారు.
జన్మభూమి కమిటీల అరాచకాల్నిగాని, ఐదేళ్ల చంద్రబాబు పరిపాలనలో అవినీతినిగాని ఏనాడూ విమర్శించని రాధాకృష్ణ ఇప్పటికీ, ఎప్పటికీ చంద్రబాబుకు తప్ప రాష్ట్రప్రయోజనాలకు కొమ్ముకాస్తాడని ఎవరూ భ్రమపడరని అభిప్రాయపడ్డారు.ఈనేపథ్యంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం కొన్ని  అంశాలమీద దర్యాప్తు చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.ఐదేళ్లుగా చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన పత్రిక, తన ఛానల్‌, ప్రసార కాంట్రాక్టులు ద్వారా రాధాకృష్ణ చేసిన దోపిడీ మీద సమగ్ర విచారణ జరగాలని కోరారు. ఇప్పుడు తనకు ఇక ధన ప్రవాహం ఆగిపోయిందన్న బాధతోపాటు చంద్రబాబు ఓడిపోయాడన్న అక్కసుతో, రాస్తున్న తప్పుడు కథనాలపై రాధాకృష్ణ పైన, ఆయనను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు మీద  క్రిమినల్‌ కేసులుపెట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.కులాల మధ్య, మతాలమధ్యచిచ్చుపెట్టడానికి తిరుపతిని వివాద కేంద్రంగా మార్చడానికి ఆర్టీసీ టిక్కెట్ల వెనుక చంద్రబాబు ముద్రించిన ప్రకటనలను జగన్‌గారి ప్రభుత్వంమీద తోయడంమొదలు, కోడెల శివప్రసాదరావు మరణం సందర్భంగా ప్రజలన్ని రెచ్చగొట్టే విషయంలో ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి దుర్మార్గం వరకూ అనేక అంశాలపై ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పుష్ప శ్రీవాణి కోరారు.గత ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం అధికారాన్ని సాగించిన అక్రమాలమీద విచారణ జరపాలని,ఒక ఛానల్‌ గాని, ఒక పత్రిక గాని , అబద్దపు కథనాలతో ప్రజల్ని రెచ్చగొట్టేలా కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా, ఒక వర్గానికి అనుకూలంగా కథనాలు ప్రసారంచేస్తే అటువంటి ఛానల్‌ను, పత్రికను చట్టబద్ధంగా శిక్షించేందుకు ఉన్న చట్టంలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఆమేరకు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఈ నేపథ్యంలోనే  రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఈ సామాజిక దౌర్జన్యంమీద, తప్పుడు ప్రచారంమీద ఎక్కడికక్కడ గొంతు ఎత్తాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.అత్యంత పారదర్శకంగా జరిగిన పరీక్షల వ్యవహారం కడివెడు పాలతో  సమానం అయితే, ఒక అమృత భాండంతో సమానమైతే.. అందులో ఒక విషపు చుక్క వేయడానికి ప్రయత్నిస్తున్నరాధాకృష్ణ మీద, అతన్ని సమర్థిస్తున్న చంద్రబాబు మీద పూర్తిస్థాయిలో క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని  పుష్ప శ్రీవాణి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.సచివాలయ నియామకాలు ఈనెల 27 న జరుగుతాయని, అక్టోబర్ 2 నుంచి గ్రామాల పరిపాలనలో కొత్తశకం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.చంద్రబాబు ఆయన తోక పత్రికలూ ఎన్నికుట్రలు చేసినా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేసారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image