4 పురపాలక సంఘాల స్థాయి పెంపు


అమరావతి : రాష్ట్రంలోని 4 పురపాలక సంఘాల స్థాయిని పెంచుతూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు  ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ స్థాయిని సెలక్షన్‌ గ్రేడ్‌ నుంచి ఫస్ట్‌ గ్రేడ్‌కు, చిత్తూరు జిల్లా పుంగనూరు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, కడప జిల్లా బద్వేల్‌ను 3వ గ్రేడ్‌ నుంచి 2వ గ్రేడ్‌కు పెంచారు. 2015-16 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీల ఆదాయ వ్యయ వివరాలనుబట్టి వాటి స్థాయులను అప్‌గ్రేడ్‌ చేసినట్లు శ్యామలరావు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు, వివిధ పట్టణాభివృద్ధి సంస్థ (ఉడా)ల పరిధిలోని భూవినియోగ మార్పిడి (ల్యాండ్‌ యూజ్‌ ఛేంజ్‌) కోసం అందే ప్రతిపాదనల పరిశీలన కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కమిటీకి ఛైర్మన్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏయూడీ) ముఖ్య కార్యదర్శి, మెంబర్‌ కన్వీనర్‌గా ఎంఏయూడీ ఓఎస్డీ (డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌), సభ్యులుగా వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, 'తుడా' వైస్‌ ఛైర్‌పర్సన్‌, డీటీసీపీలను నియమించింది.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image