విజయవాడ,
*సంస్థ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎం. టి . కృష్ణబాబు, ఐ. ఏ. ఎస్. తొలి పర్యటన
సంస్థ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం. టి . కృష్ణబాబు, ఐ. ఏ. ఎస్. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా ఈ రోజు అనగా 28.09.2019 న విజయవాడ డిపోను సందర్శించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ కె. వి. ఆర్. కె. ప్రసాద్ (ఆపరేషన్స్) , శ్రీ పి. వి. రామారావు (ఇంజినీరింగ్), విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గిడుగు వెంకటేశ్వరరావులు ఆయనకు హార్దిక స్వాగతం పలికారు. డిపో లోని ప్రతి విభాగాన్ని ఆయన పరిశీలించారు. బస్సుల సమయ పాలన, నిర్వహణ తీరు, సిబ్బంది హాజరు , గ్యారేజీ కార్మికుల పనితీరు గురించి విజయవాడ రీజనల్ మేనేజర్ శ్రీ నాగేంద్రప్రసాద్ , గౌరవ ఎం. డి. గారికి వివరించారు. ప్రయాణికులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడాలని ఈ సందర్భంగా శ్రీ కృష్ణబాబు తెలిపారు.
ప్రభుత్వ పరంగా ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా రవాణాలో మన సంస్థ దేశంలోనే ఉత్తమ సేవలు అందించేలా పేరు తెచ్చుకోవాలని ,ఆ విధంగా అందరూ కలిసి కట్టుగా శ్రమించాలని తెలిపారని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు . ఎక్కడైనా కార్పోరేషన్ లను ప్రైవేట్ పరం చేయాలని చూస్తారని కానీ ముఖ్యమంత్రి గారు మన కార్పోరేషన్ ను ప్రభుత్వపరం చేశారనీ , ఆ ప్రక్రియ జనవరి లోపు పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా కృషి చేసి సంస్థను దేశంలోనే నెంబర్ వన్ గా నిలపాలని వివరించారు.ఇక రిటైర్డ్ ఉద్యోగుల గురించి ఆలోచిస్తూ ఈ నెల నుండే 60 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు పెంచాలని ,2 రోజుల్లో ఆదేశాలు వెలువడనున్నాయని .ముఖ్యమంత్రి గారు తెలిపినట్లు ఎం. డి. శ్రీ కృష్ణబాబు స్పష్టం చేశారు .అనంతరం గ్యారేజీ ఆవరణలో మొక్కలు నాటారు. అన్ని యూనియన్ల నాయకులు పాల్గొని నూతన ఎం. డి. గారికి పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికి, కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందించారు. అనంతరం విజయవాడ పి. ఎన్. బి. ఎస్. బస్టాండుని చేరుకుని, ప్లాటుఫారమ్ల నిర్వహణ , ప్రయాణికులకు కల్పిస్తున్న సదుపాయాలు, విచారణ కేంద్రం , రిజర్వేషన్ పాయింట్లను పరిశీలించారు. కార్గో కార్యాలయాన్ని పరిశీలించి ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఈ పర్యటనలో విజయవాడ డిపో మేనేజర్ శ్రీ సి.ఎస్. శివరామ్, డిప్యూటీ సి. టి. ఎం. లు, విజయవాడ జోన్ అధికారులు, డిపో /బస్టాండు అధికారులు ,కార్మిక నేతలు ,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పర్యటన