ఇక నుంచి వైఎస్సార్‌ పెళ్లి కానుక

ఇక నుంచి వైఎస్సార్‌ పెళ్లి కానుక
శ్రీరామ నవమి నుంచి అమలు
పెళ్లి కానుక మొత్తాలు పెంచుతూ నిర్ణయం
ఏలూరు  : గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పెళ్లి కానుక పథకానికి కొన్ని మార్పులు చేస్తూ తాజాగా వైఎస్సార్‌ పెళ్లి కానుక పథకాన్ని అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో లబ్ధిదారులకు అందించే మొత్తాలను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే శ్రీరామనవమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న పెళ్లి కానుక పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, భవన నిర్మాణ కార్మికులకు పెళ్లి సమయంలో కానుకలు అందిం చారు. అప్పట్లో పథకానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిఽఽధులు కూడా కేటాయి ంచింది. గతేడాది ఏప్రిల్‌ నెల 20వ తేదీన అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 11వేల 780మంది దంప తులు రిజిస్ట్రేషన్‌ చేయించు కున్నారు. ఇందులో అప్పట్లో 5902 మందికి రూ. 25.1 కోట్లు నిధులు పెళ్లి కానుకగా అందించారు.
పెళ్లి కానుక పెంచుతూ నిర్ణయం : గత ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు అందించే రూ.40 వేలను రూ.లక్షకు పెంచారు. ఎస్టీలకు అప్పట్లో రూ.50 వేలు అందించేవారు. అది కూడా రూ. లక్షకు పెంచారు.బీసీలకు గతంలో రూ.35 వేలు అందించగా ఆ మొత్తాన్ని రూ. 50 వేలకు పెంచారు. మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. వికలాం గులకు రూ. లక్ష నుంచి లక్షా 50 వేల రూపాయలకు పెంచారు. ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహాలు చేసుకుంటే గతంలో రూ.75 వేలు అందజేయగా ఆ మొత్తాన్ని రూ.1.20 లక్షలకు పెంచారు.గతంలో బీసీలు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 35 వేలు చెల్లి ంచేవారు ఆ మొత్తాన్ని కూడా రూ.70 వేలకు పెంచు తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెళ్లి కానుకల మొత్తాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లబ్ధిదారుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.