దక్షిణ కొరియా నుంచి 60 మంది సభ్యులతో కూడిన బృందం రాక.

 


అమరావతి 
20.9.2019


విద్యాశాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్‌ ప్రెస్ మీట్ 


- విద్యాప్రమాణాల మెరుగుదలపై ఎపి విద్యాశాఖా అధికారులతో దక్షిణ కొరియా ప్రతినిధి బృందం భేటీ. 
- దక్షిణ కొరియా నుంచి 60 మంది సభ్యులతో కూడిన బృందం రాక.
- 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన.
- విద్యతో పాటు ఐటి, హెల్త్, అగ్రికల్చర్‌, ఫిషరిస్‌, హార్టీకల్చర్‌, పరిశ్రమలు తదితర అంశాలపై ఇరు ప్రాంతాల మధ్య టెక్నాలజీ, ఐడియాలజీ పరస్పర సహకారంమే లక్ష్యం. 
- దీనిలో భాగంగా మొదటిరోజు 18 మంది కొరియన్‌ బృందంతో విద్యాశాఖ అధికారుల భేటీ. 
- ఉన్నత విద్యలో స్కిల్ డెవలప్‌మెంట్‌ కోసం కొరియన్‌ టెక్నాలజీ.
- దక్షిణ కొరియాలో ఎపికి ప్రత్యేకంగా ఒక సెంటర్‌ ఏర్పాటుకు అంగీకారం.
- అలాగే ఎపిలో కూడా కొరియన్‌ టెక్నికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు.
- దక్షిణ కొరియాతో బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ పై శిక్షణ భాగస్వామ్యం.
- టీచర్ల శిక్షణ, నైపూణ్యం పెంపుదలలో కొరియన్‌ విధానాలు.
- ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఒకేషనల్‌ విద్యలో పరస్పర సహకారంపై చర్చ.
- రాష్ట్రంలో దక్షిణ కొరియాతో కొన్ని కొత్త విద్యా కార్యక్రమాలు ప్రారంభిస్తాం.
- రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తాం.
- సిఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ఆదేశాలకు అనుగుణంలో విద్యా ప్రమాణాల పెంపు
- సంస్కరణల్లో భాగంగా జస్టీస్‌ శ్రీ కాంతారావు, జస్టీస్‌ శ్రీ ఈశ్వరయ్యలతో రెండు కమిటీలు.
- ప్రాధమిక, ఉన్నత విద్యకు సంబంధించిన పూర్తి అధికారాలు ఈ కమిటీలకు. 
- ఫీజుల నియంత్రణ చట్టం అమలు, ఇతర ప్రమాణాలపై ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో విద్యా, సాంకేతిక శిక్షణకు దక్షిణ కొరియా భాగస్వామ్యం, పరస్పర సహకారంపై అంగీకారం కుదిరినట్లు రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన దక్షిణ కొరియా ప్రతినిధి బృందం తొలిరోజు తన ఆధ్వర్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యిందని తెలిపారు. మొత్తం పద్దెనిమిది మంది కొరియన్‌ బృందంతో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై అంగీకారం కుదిరిందని అన్నారు. వృత్తివిద్యలో నైపూణ్యాభివృద్దికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ లను ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనిని దక్షిణ కొరియా బృందానికి వివరించామన్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా ఇప్పటికే దక్షిణ కొరియాలో ప్రత్యేకంగా ఒక సెంటర్‌ వుందని, దీనితో పాటు ఎపికి సంబంధించిన సెంటర్‌ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చ జరిగినట్లు తెలిపారు. దక్షిణ కొరియన్‌, ఎపి లోని ఇనిస్టిట్యూట్‌ల మద్య పరస్పర విద్యాసంబంధ అంశాల భాగస్వామ్యంను మరింతగా పెంచాలని కూడా చర్చించామని అన్నారు. 
దక్షిణ కొరియాకు చెందిన బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ విషయంలో ఎపితో పరస్పర సహకారం, శిక్షణకు కొరియన్‌ బృందం ముందుకు వచ్చినట్లు తెలిపారు. దీనితో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో కొరియన్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ లకు కూడా దక్షిణ కొరియా సాంకేతిక శిక్షణలో సహకారంను అందించేందుకు అంగీకరించిందని అన్నారు. ట్రిపుల్‌ ఐటిల్లో ఏర్పాటు చేస్తున్న ఇంక్యుబేషన్‌ సెంటర్‌ లకు కూడా సాంకేతిక సహకారంను కోరుతున్నామని తెలిపారు. దక్షిణకొరియా, ఆంధ్రప్రదేశ్‌ ల మద్య విద్యాసంబంధ కార్యక్రమాల పరస్పర సహకారంపై కూడా ఈ భేటీలో చర్చ జరిగిందని అన్నారు. అలాగే కొరియాలో టీచర్‌ ట్రైనింగ్ విధానాలు సమర్థంగా వున్నాయని, ఈ విధానాలను ఎపిలో కూడా అమలు చేసే విషయంలో కూడా చర్చ జరిగిందని అన్నారు. విద్యార్ధులకు బోధించే పద్దతులు, అనుసరించే విధానాలను రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు అందిస్తే... వారికి మరింత నైపూణ్యం అలవడుతుందని అభిప్రాయపడ్డారు. 
 విద్యాప్రమాణాల కోసం రిటైర్డ్ న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీలు
రాష్ట్రంలో ప్రాధమిక, ఉన్నత విద్యలో ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా కమిషన్లను ఏర్పాటు చేయాలని సంకల్పించారని విద్యాశాఖమంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీనిలో జస్టీస్‌ శ్రీ ఆర్‌ కాంతారావు చైర్మన్‌ గా పాఠశాల విద్యా నియంత్రణ కమిటీ, జస్టీస్‌ శ్రీ వి.ఈశ్వరయ్య చైర్మన్‌ గా ఉన్నత విద్యానియంత్రణ కమిటీలను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఫీజుల నియంత్రణ, విద్యాసంస్థల్లో ప్రమాణాల పర్యవేక్షణతో పాటు ఇతర అంశాల్లో ఈ కమిటీలకు పూర్తి అధికారాలు వుంటాయని వెల్లడించారు. ఇప్పటి వరకు అమలులో వున్న  ఎఎఫ్‌ఆర్‌సి రద్దు తరువాత ఈ కమిటీలే కమిషన్లుగా పూర్తిగా విద్యావ్యవస్థను పర్యవేక్షిస్తాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో విద్యాప్రమాణాలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని అన్నారు. ఇప్పటికే విద్యాసంస్కరణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా త్వరలోనే తన నివేదికను సమర్పించనున్నదని తెలిపారు. ఈ నివేదికను కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలకు అందచేస్తామని తెలిపారు.


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం