రాజమండ్రి:ప్రభుత్వాసుపత్రిలో బోటు ప్రమాదం నుంచి బయటపడ్డవారిని పరామర్శించిన ముఖ్యమంత్రి శ్రీవైయస్.జగన్
చికిత్స పొందుతున్నవారి వద్దకు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి
అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి
ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పలకరించి, ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి
ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న సీఎం
సీఎం ఎదుట కన్నీరుమున్నీరైన తిరుపతికి చెందిన మధులత
ప్రమాదంలో భర్త సుబ్రహ్మణ్యం, కుమార్తె మధులత మరణించారంటూ సీఎంకు చెప్పిన మధులత
క్లిష్టపరిస్థితుల్లో ఉన్న నన్ను డాక్టర్లు బతికించారని ముఖ్యమంత్రికి చెప్పిన మధులత
తన భర్త ఉప్పుడూ మీ గురించే చెప్పేవారు, కష్టాల్లో గుండె ధైర్యం తెచ్చుకుని ఎలా బతకాలో.. చెప్తూ మీగురించి తరచుగా ప్రస్తావించేవారు: ముఖ్యమంత్రితో తిరుపతికి చెందిన మధులత
మీరొచ్చినాలో ధైర్యాన్ని నింపారు : సీఎంతో తిరుపతికి చెందిన మధులత
తెలంగాణలోని చిట్యాల మండలం వన్నిపాకంకు చెందిన బాధితులను కలుసుకున సీఎం
ఉప్పల్‌కు చెందిన జానకిరామారావును పరామర్శించిన సీఎం
కుటుంబాన్ని కోల్పోయిన జానకి రామారావుకు ధైర్యం చెప్పిన సీఎం
ప్రమాదంలో భుజానికి గాయం, అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్న సీఎం
వరంగల్ జిల్లా కరిపికొండెం బాధితులను కూడా పరామర్శించిన సీఎం
బాధితులందరికీ మంచి వైద్యం అందించాలంటూ వైద్యులను ఆదేశించిన వైయస్.జగన్
కోలుకున్న తర్వాతనే వారందన్నీ ఇళ్లకు పంపించాలనిన ఆదేశం
దేనికీ వెనుకాడవద్దని వైద్యులను ఆదేశించిన వైయస్.జగన్
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆస్పత్రివద్దే సీఎం కలసుకున్నారు
మృతదేహాలు గ్రామాలకు తరలించేందుకు అన్నిఏర్పాట్లూ చేయాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు కన్నబాబు, ఆళ్లనాని, పినిపె విశ్వరూప్, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, తెలంగాణమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు ఉన్నారు.