ఇంద్రకీలాద్రికి చేరుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ సి . ప్రవీణ్ కుమార్ దంపతులు

విజయవాడ : అక్టోబరు 2 
 శరన్నవరాత్రుల్లో నాల్గవ రోజున హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు . ఇంద్రకీలాద్రికి చేరుకున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ సి . ప్రవీణ్ కుమార్ దంపతులకు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం . వి . సురేష్ బాబు స్వాగతం పలికారు . ఆలయ వేదపండితులు వేదమంత్రాలతో కూడి అమ్మవారి దర్శనానికి తోడ్కొని తీసుకుని వెళ్లారు . దర్శనం అనంతరం అమ్మవారిని ఆశీస్సులతో కూడిన వేదపండితులు , ఆలయ ప్రధాన అర్చకులు , ఇవో ఆధ్వర్యంలో అమ్మవారి శేషావస్త్రాన్ని , ప్రసాదాన్ని అమ్మవారి ఫోటో జ్ఞాపికను అందజేశారు .