మనసున్న రాజు ఉంటే ఆ భగవంతుడు సైతం కరుగుతాడు,

*15.10.2019*
*కాకుటూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా*


*అనిల్‌కుమార్‌ యాదవ్‌, జలవనరుల శాఖా మంత్రి*


ఈ రోజు ప్రతిష్టాత్మకమైన రైతు భరోసా కార్యక్రమానికి మన జిల్లాలో ప్రారంభిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి, అలాగే పెద్దలందరికీ, అధికార యంత్రాగానికి, రైతు సోదరులకూ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.


రాష్ట్రంలోనే ఈ రోజు రైతాంగానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రైతు భరోసా కార్యక్రమం. ఏదైతే పాదయాత్రలో రైతాంగానికి సంబంధించి ఏటా 12500 చొప్పున యాభైవేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తాను అని చెప్పిన మన ముఖ్యమంత్రి నాలుగేళ్ళు కాదు ఐదేళ్ళు ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి 13500 రూపాయలు చేసిన గొప్ప మనసున్న నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌. తండ్రికి తగ్గ తనయుడిగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి బిడ్డగా ఈ రోజు మరోసారి నిరూపించుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలో మనమంతా చూస్తున్నాం, మనసున్న రాజు ఉంటే ఆ భగవంతుడు సైతం కరుగుతాడు, ఈ రోజు రాష్ట్రమంతా ఏ డ్యామ్‌ చూసినా నీళ్ళతో కళకళలాడుతూ ఉన్నాయి. ప్రతీ జిల్లాలో ప్రతీ రైతు ముఖంలో చిరునవ్వు చూస్తూ ఉన్నాం. రికార్డులు బ్రేక్‌ చేయాలన్నా, రికార్డులు స్ధాపించాలన్నా ఆ కుటుంబానికే చెల్లుతుంది. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ఏదైతే రైతాంగం కోసం చేశారో ఈ సారి పులిచింతల మొట్టమొదటిసారిగా 45 టిఎంసిల పూర్తిసామర్ధ్యంతో నీటితో నింపడం ఈ ముఖ్యమంత్రి పాదం మోపిన తర్వాతే అని తెలియజేస్తున్నా. అదే కాకుండా మన జిల్లాలో సోమశిల వచ్చిన తర్వాత 78 టిఎంసీ అయితే 2008లో 73 టిఎంసీ నిల్వచేసుకోగలిగాం. కానీ మొట్టమొదటిసారిగా 75 టిఎంసి నిల్వచేసిన సంవత్సరం...ఈ సంవత్సరమే. 


చంద్రబాబునాయుడు ఇదే జిల్లాలో నిన్న ఒక మాట మాట్లాడారు. నా వల్లే జలాశయాలు నిండాయి అంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబునాయుడు ఒక నిజం మాట్లాడారు. ఐదు సంవత్సరాల దరిద్రమైన పాదం రాష్ట్రంలో మోపితే ఒక్క డ్యామ్‌ నిండలేదు. వర్షం లేదు. ప్రజలంతా ఆయన్ను సాగనంపి ఒక మనసున్న మారాజును ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రంలో డ్యామ్‌లు ఎలా కళకళలాడుతాయి, రైతాంగం ముఖంలో చిరునవ్వు ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆ మాజీ ముఖ్యమంత్రికి చూపించడం జరిగింది. రైతు భరోసా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తుంటే హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ అయి పాదం ఈ జిల్లాలో మోపారో లేదో కుంభవర్షం కురిసింది. అదీ ఒక నాయకుడు, మనసున్న రాజు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చెప్పడానికి. ఏ జన్మలో నేను పుణ్యం చేసుకున్నానో కానీ, నా తల్లిదండ్రులు ఏం పుణ్యం చేసుకున్నారో తెలీదు కానీ ఒక మనసున్న రాజు ముఖ్యమంత్రిగా ఇన్ని డ్యామ్‌లు నిండుతూ కోట్లాది రైతులు సంతోషంగా ఉంటే దాంట్లో ఇరిగేషన్‌ శాఖామంత్రిగా నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చిన నా దైవం చల్లగా ఉండాలని తెలియజేస్తున్నా. చివరిగా ఈ రోజు ఈ జిల్లాలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చారు. ఇన్ని వేల మంది జనం ముందు నాకు ఒక్క అవకాశం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఏ బీసికి ముఖ్యమంత్రి ఇవ్వలేదు. చరిత్రలో ఇంకో యాభై సంవత్సరాలు అయిన తర్వాత కూడా జిల్లాలో బీసికి మంత్రి పదవి ఎవరిచ్చారు అంటే అది జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారని గర్వంగా చెప్పచ్చు. యాభై సంవత్సరాల తర్వాత ఆ మంత్రి ఎవరు అంటే...ఈ జిల్లాలో ఒక చిన్న పేజి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు ఉందంటే నా జన్మకు ఇంతకన్నా ఏం కావాలి. నన్ను కన్న నా తండ్రి పైనున్నారు...నా తల్లి ఇక్కడున్నారు, నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా...నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకూ జగనన్నకు ఒక సైనికుడిగానే ఉంటానని తెలియజేస్తున్నా. ఆ భగవంతుడు ఇంకో జన్మంటూ నాకు ఇస్తే నా దైవానికి ఒక అనుచరుడిగా ఉంటానని చెప్పి , ఈ అవకాశం ఇవ్వమని ఆ దైవాన్ని కోరుకుంటాను. నా జన్మలో ఇంతకన్నా ఇంకేం కావాలని కూడా లేదు. చాలు ఎమ్మెల్యేని చేశారు, ఈ జిల్లాలో బీసిని మంత్రిగా చేశారు, నాకు తెలుసు ఎంత ఇబ్బంది ఉంటుందో, ఇంతకన్నా కోరుకునేదేమీ లేదు. చాలు సంతోషం. ఇంతకన్నా నాకు జగనన్న అనుచరుడంటేనే గర్వంగా ఉంటుంది, ఎమ్మెల్యే, మంత్రి కన్నా. ఈ రోజు ఈ జిల్లాలో ప్రతీ ఎకరాకు నీరందించబోతున్నాం. ఇంకా 25, 30 సంవత్సరాల పాటు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రంలో ఇంకెవరికీ అవకాశం లేదు. ఎవరెన్ని గింజుకున్నా ఇంక లేదు. అయిపోయింది. 


ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆజన్మాంతం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేను, ఆజన్మాంతం ఆయనకు సేవకుడిగానే ఉంటానని తెలియజేసుకుంటున్నా


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం