పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్

   తేదీ 16.10.2019


పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్
పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
******


అమరావతి :
ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా చేయాలన్నది ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి లక్ష్యం. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయానికి అనుగుణంగా పట్టణ ప్రాంత గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఎపి టిడ్కో (APTIDCO) లో కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 
 గత ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు టెండర్లు ఖరారు చేస్తూ, ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా వ్యవహరించిన తీరుకు ఫుల్ స్టాప్ పెట్టే చర్యల్లో భాగంగా అప్పటికే ప్రారంభం కాని పనులను రద్దు చేయడం, కొనసాగుతున్న పనులను  పునః సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ్ రెడ్డి గారు ఆదేశించిన సంగతి తెలిసిందే. 
 ఈ నేపథ్యంలో టిడ్కో ఆధ్వర్వంలోని వివిధ గృహ నిర్మాణ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల పనుల పురోగతి, స్థితిగతులు సమీక్షించిన అనంతరం, ఈ పనులకు కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలన్న ఉత్తర్వులపై మంత్రి బొత్స సత్యనారాయయణ సంతకం చేశారు. రివర్స్ టెండరింగ్ లో అనుసరించాల్సిన విధి విధానాలను మంత్రి  ఖరారు చేశారు. ఈ నిర్ణయంతో ప్రాజెక్టుల వ్యయం తగ్గి ఖజానాపై భారం తగ్గడంతో పాటు, ఆయా పథకాల్లోని లబ్ధిదారులపై ఆర్ధిక భారం కూడా తగ్గుతుంది.  ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా టిడ్కో రివర్స్ టెండర్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.


Popular posts
చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ..