ప్రభుత్వ పాఠశాలకు రూ. 2 లక్షలు ఫర్నిచర్ వితరణ

 

అంతిమతీర్పు - శ్రీసిటీ -నెల్లూరు జిల్లా
 


శ్రీసిటీ జపాన్ పరిశ్రమలచే  ప్రభుత్వ పాఠశాలలకు 


రూ.2 లక్షల విలువైన ఫర్నిచర్ వితరణ


 

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా శ్రీసిటీ జపనీస్ కంపెనీస్ గ్రూప్ (ఎస్ జె సీ జీ) శ్రీసిటీ పరిధిలోని మత్తేఱిమిట్ట, చెరివి, ఇరుగుళం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు సుమారు 2 లక్షల రూపాయల విలువచేసే డెస్కులు, బెంచీలు వితరణగా ఇచ్చారు. 

 

గురువారం మత్తేఱిమిట్ట స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్ జె సీ జీ చైర్మన్ ఒటానబే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డెస్కులు అందచేశారు. ఈ సందర్భంగా  ఒటానబే మాట్లాడుతూ, ఇది వరుసగా మూడవ ఏడాది తాము చేపడుతున్నసీఎస్ఆర్ కార్యక్రమం అన్నారు. గత ఏడాది ఇరుగుళం స్కూల్ కు డెస్కులు పంపిణీ, అంతకు క్రితం ఏడాది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు వసతి కోసం ప్రస్తుతం డెస్కులు వితరణగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
 

సీఎస్ఆర్ కార్యకలాపాలపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ, శ్రీసిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు పెంపొందించే దిశగా తాము ప్రత్యేక శ్రద్ద చూపుతున్నామన్నారు. ఫలితంగా ఈ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య, ఉతీర్ణత శాతం పెరగడంతో పాటు క్రీడల్లోను బాగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. 

 

ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం మండల విద్యాశాఖాధికారి సరస్వతి, శ్రీసిటీ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ సురేంద్రకుమార్, మత్తేఱిమిట్ట ఎంపియుపి స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఈశ్వరయ్య, చెరివి ఎంపియుపి స్కూల్ ప్రధానోపాధ్యాయులు రామసుబ్బయ్య, ఇరుగుళం  ఎంపియుపి స్కూల్ ప్రధానోపాధ్యాయులు  చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.   

 

కాగా, శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా గత పదేండ్లుగా పలు కార్యక్రమాలతో శ్రీసిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదనపు స్కూల్ భవనాల నిర్మాణం, డెస్కులు, బెంచీలు పంపిణీ, ఏటా నోటు పుస్తకాల పంపిణీ, ఇతర విద్య పరికరాలు, క్రీడా పరికరాలు పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఇచిత రవాణా సదుపాయం, హెల్త్ చెకప్, స్కూల్ యూనిఫామ్ ల పంపిణీ, విద్యా వాలంటీర్ల నియామకం వంటివి చేపడుతున్నారు. విద్యాయేతర కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ తరచూ వివిధ పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందచేస్తున్నారు. స్వచ్ఛ భారత్, మొక్కలు నాటడం వంటి చర్యల ద్వారా స్కూల్ పరిసరాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో వుంచేందుకు విద్యార్థులలో ప్రేరణ కలిగిస్తున్నారు. 

  


 

Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం