మరోసారి తిరుపతి నగరం లో నిడ్జమ్-2019 కి వేదిక : కాటమనేని భాస్కర్


మరోసారి తిరుపతి నగరం లో నిడ్జమ్-2019 కి వేదిక - కాటమనేని భాస్కర్  
నిడ్జమ్-2019 నిర్వహణకు జిల్లా యంత్రాంగం  సిద్దం – జిల్లా కలెక్టర్ 
నగర పాలక సంస్థ  సహకారం అందిస్తుంది – గిరీషా పి. ఎస్. 


 తిరుపతి, అక్టోబర్ 22:   గత సంవత్సరం 2018  డిసెంబర్ 1 నుండి 3 వరకు  నిడ్జమ్-2018 నిర్వహణ  ఘనంగా జరిపినందున  కేంద్ర క్రీడల శాఖ  సూచన మేరకు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎల్ వి సుబ్రమణ్యం ఆదేశాలతో  మరో సారి తిరుపతి నగరం  నిడ్జమ్ కు ఆతిధ్యం ఇవ్వవలసి వున్నదని శాప్  ఎం.డి. మరియు ఛైర్మన్  కాటమనేని భాస్కర్ ఐ.ఎ.ఎస్. అన్నారు.  మంగళ వారం ఉదయం స్థానిక  శ్రీ పద్మావతి  మహిళా విశ్వవిద్యాలయ సావేరి అతిథి గృహ ఆడిటోరియం రాబోవు నవంబర్  23 నుండి 25 వరకు  నిర్వహించనున్న  జాతీయ అంతర్ జిల్లాల  జూనియర్  అథ్లటిక్ మీట్ – 2019 (నిడ్జమ్) పై ఛైర్మన్  జిల్లా యంత్రాంగం తో సమావేశమై సమీక్షించారు.  
 ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ గతంలో ఇక్కడ నిర్వహించిన నిడ్జమ్ క్రీడలు విజయవంతమైనందున  అన్నివర్గాల  నుండి అభ్యర్థనల మేరకు   మరో సారి తిరుపతి నగరం నిడ్జమ్  కు వేదిక అయిందని అన్నారు.  ఈ సారి విశాఖ పట్టణం  వేదిక గా  నిర్వహించతలపెట్టినా  పై అభ్యర్థనల మేరకు తిరుపతి నగరంలో 2019  నవంబర్ 23 నుండి 25 వరకు  నిర్వహించ నున్నామని అన్నారు. క్రీడల నిర్వహణకు నిధుల విషయంలో ఇబ్బందులు లేవని   గతం కన్న ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్దంగా  ఉండాలని సూచించారు.  మన రాష్ట్రంకు సంబందించిన  క్రీడాకారులకు  సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ లో  శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు.  14-17 సంవత్సరాల లోపు  యువత తన టాలెంట్  నిరూపణకు ఇది ఒక గొప్ప  సదవకాశమని  తెలిపారు.  
 జిల్లా  కలెక్టర్   డా. భారత్ గుప్తా మాట్లాడుతూ  28 రాష్ట్రాల నుండి వచ్చే  4,500 మంది క్రీడాకారులకు అతిధ్యం ఇవ్వడానికి సిద్దంగా వున్నామని అన్నారు. రవాణా, వసతి, రిసీప్షన్ సెంటర్లు రేణిగుంట ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, తిరుపతి సి.బి.ఎస్.సి లలో ఏర్పాటు  కమిటీల ఏర్పాటు, తారక రామా స్టేడియం వేదికగా క్రీడల నిర్వహణ కావలసిన ట్రాక్ లు ఆర్ అండ్ బి తో  ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. శాప్ ప్రతినిధులు సూచనమేరకు స్టేడియం ఏర్పాట్లు వుంటాయని ఘనంగా నిర్వహించేందుకు కృషి చేయనున్నామని తెలిపారు.  
 నగర పాలక కమీషనర్ పి. ఎస్. గిరీషా మాట్లాడుతూ  గత నిడ్జమ్ నిర్వహణలో  జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించానని గత అనుభవాలను దృష్టిలో వుంచుకుని   అథ్లెటిక్ క్రీడల అయినందున క్రీడాకారులకు బస ప్రాంతాలలో స్నానానికి  వేడి నీళ్ళు, ఫిజియో థెరపీ, మెడికల్ టీమ్ లు, భోజన వసతుల ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు  లేకుండా చూస్తామని, తిరుపతి   నగర పాలక పరిధిలో  ప్లాస్టిక్ నిషేధం ప్రాధాన్యత కారణంగా  త్రాగునీటి  కోసం  ఆర్. ఓ. వాటర్  టిన్స్  అందుబాటులో వుంచునున్నామని,   పారిశుధ్యం పై ప్రత్యేక  దృష్టి సారిస్తామని  వివరించారు.  
     అథ్లిటిక్  ఫెడరేషన్  ఆఫ్ ఇండియా సెక్రెటరీ  వల్సన్ మాట్లాడుతూ  గతంలో మీరిచ్చిన అతిధ్యం గొప్పగా వుందటం వల్ల  మరోసారి తిరుపతి నగరం  వేదికగా  నిడ్జమ్ నిర్వహణకు అభ్యర్థించామని,  ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు  మీ వంతు సహకారం అందిస్తారని కోరుతున్నామని తెలిపారు. 
  జె. సి. 2 చంద్రమౌళి మాట్లాడుతూ  4500 మంది  క్రీడాకారులకు ఆతిధ్యం కోసం 1500 మంది అధికారులు , సిబ్బంది, రవాణా సౌకర్యం కోసం బస్సుల ఏర్పాట్లు ,  క్రీడల సమయంలో వసతి పొందే విద్యాలయములకు సెలవులు వంటివి అవసరమని గత అనుభవాలను దృష్టిలో వుంచుకుని మరింత ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. 
       ఈ సమావేశ నిర్వహణ జిల్లా క్రీడల సంస్థ అధికారిని లక్ష్మీ ఏర్పాటు చేయగా,   అథ్లిటిక్  ఫెడరేషన్ ఈ వెంట్   ఆర్గనైజర్  దినేష్ , ఆర్ అండ్ బి ఇ ఇ ధనజయ రావు, ఎస్ ఇ. ఆర్ డబ్ల్యూ, ఎస్ వేణు, కార్పొరేషన్ ఏం ఇ చంద్రశేఖర్ , డి ఎస్. ఓ.   విజయ రాణి, జిల్లా అధికారులు,  చీఫ్ కోచ్ సయీద్ సాహెబ్, కోచ్ లు  బాలాజి, సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 
నిడ్జమ్ లో జరగనున్న  క్రీడల  వివరాలు :
అండర్ 14 బాయిస్ అండ్ గర్ల్స్ :  100 మరియు 600 మీటర్ల పరుగులు, లాంగ్ జంప్ , హైజంప్ , సార్ట్ పుట్ 
అండర్ 16 బాయిస్ అండ్ గర్ల్స్ : 100,200,400,1000 మీటర్ల పరుగు , 100 హార్డుల్స్, లాంగ్ జంప్ , హైజంప్ , సార్ట్ పుట్ జావలిన్ త్రో, డిస్కస్ త్రో, 100 మీటర్ల,400 మీటర్ల రిలే .
- వి


Popular posts
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
దసరా సెలవుల్లో.. రైళ్లు.. ఫుల్‌
చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు
టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనా విడుదల చేసిన చంద్రబాబు
Image