అంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అఖిలభారత స్థాయి అధికారుల బదిలీ  

*అంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అఖిలభారత స్థాయి అధికారుల బదిలీ జరిగింది...*
 
సంజయ్‌గుప్తాను పీసీసీఎఫ్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ జీఎస్‌ఆర్‌కే విజయకుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. జీఎస్‌ఆర్‌కే విజయకుమార్‌కు ప్లానింగ్‌ కార్యదర్శి, సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ సుమిత్‌కుమార్‌కు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విభాగపు బాధ్యతలతో పాటు ఇసుక సరఫరా బాధ్యతలు ప్రత్యేకంగా అప్పగించారు. సీసీఎల్‌ఏ స్పెషల్‌ కమిషనర్‌ ఎం.హరినారాయణ్‌కు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, గ్రామ సచివాలయాలు, గ్రామవాలంటీర్ల శిక్షణ వంటి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రణాళిక విభాగం ఉపకార్యదర్శిగా వి.కోటేశ్వరమ్మకు బాధ్యతలు అప్పగించారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం