అజ్ఞానం చీకటి...జ్ఞానం వెలుగు: ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి

మీకు...మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలతో


అజ్ఞానం చీకటి...జ్ఞానం వెలుగు.


మనిషి చేసే పాపం చీకటి 
ఆచరించే పుణ్యం వెలుగు.


మనిషి అనుభవించే కష్టం చీకటి.
మనిషి పొందే సుఖం వెలుగు.


మనిషిలోని మృత్యుభయమే చీకటి.
మనిషిలోని ఆత్మస్థైర్యమే వెలుగు.


ఈ చీకటి వెలుగుల రంగేళి ఈ జీవితం...
ఈ భవ్య జీవితం...దివ్య జీవనంగా పరిణతి చెందాలి.
అన్ని హృదయ మందిరాల్లో జ్ఞానదీపాలు వెలగాలి.
ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలూ.
చీకటి మటుమాయమైపోతుంది.
దీప కాంతి ...తాను హరించుకుపోయినా.
లోకానికి వెలుగునివ్వడం మానదు.


ఒక దీపంతో మరెన్నో దీపాలను వెలిగించాలి.
భారతీయులందరిలో చైతన్య దీప్తిని రగిలించాలి.


ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి
ప్రతి ఇల్లు ఆనంద దీపావళి కావాలి మనసారా ఆకాంక్షిస్తూ ..జై హింద్
మీ..!
✍ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి 
నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ 
యువజన క్రీడల మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం.న్యూఢిల్లీ.