జీవీఎంసీ అధికారులతో మంత్రుల సమీక్షా సమావేశం

జీవీఎంసీ అధికారులతో మంత్రుల సమీక్షా సమావేశం
విశాఖపట్నం : ఇసుక కొరతకు సంబంధించి మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీవీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతీ శ్రీనివాస్‌, ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, ఎమ్మెల్యే గుడివా అమర్‌నాథ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు యుద్ద ప్రాదిపదికన జీవీఎంసీలోని రోడ్లు, కాల్వలు, శ్మశాన వాటికల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి బొత్స అధికారులను ఆదేశించారు. మరో నెల రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో మూడు వేల కోట్ల పనులకు ప్రారంభోత్సవాలకు సిద్దం చేయనున్నట్లు మరో మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దీపావళి నాటికి విశాఖలో ఇసుకకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, అందుకోసం డెంకాడలో ఇసుక రీచ్‌ కేటాయింపులు జరపాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన బూసర్ల లక్ష్మి కుటుంబానికి మంత్రులు బొత్స, అవంతీలు పది లక్షల నష్ట పరిహారం అందించారు.
బోటు బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం : బోటు ప్రమాదంలో మృతి చెందిన తిరుపతి వాసుల కుటుంబీకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. తిరుపతికి చెందిన సుబ్రమణ్యంతో పాటు ఆయన కుమార్తె, కుమారుడు చనిపోయారు. ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సుబ్రమణ్యం భార్య మాధవి లతకు 15 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. బోటు ప్రమాదం లో సుబ్రమణ్యం తో పాటు ఆయన ఇద్దరు బిడ్డలు చనిపోవడం చాలా బాధాకరమని కరుణాకర్ రెడ్డి అన్నారు. సుబ్రమణ్యం కుటుంబీకులకు భవిష్యత్తులో  కూడా ప్రభుత్వం  అండగా ఉంటుందని కరుణాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం