తేది 26-10-2019
5 నెలల నుండి గుంటూరు రోడ్ల డ్రైనేజి బిల్లులు ఎందుకు చెల్లించలేదు?
- మద్దాళి గిరిధర్
గుంటూరు :
2019-20 బడ్జెట్లో పట్టణాభివృద్ధికి రూ.6,587 కోట్లు కేటాయించి ఇంత వరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఉన్న డబ్బు వాలంటీర్ల పేరుతో వైకాపా కార్యకర్తలకు మళ్లించారు. దీని వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క నగరాన్ని ఇంత వరకు అభివృద్ధి చేయలేదు. జగన్ పాలనలో అన్నీ రంగాలను కుదేలయ్యాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా పట్ల వైకాపా నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. ఇప్పటికే రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు గుంటూరును అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు. గుంటూరులో దశాబ్ధాలుగా పెండింగ్లో ఉన్న అండర్ డ్రైనేజ్ కార్యక్రమాన్ని చేపట్టింది. రూ.500 కోట్లతో చేపట్టిన పనుల్లో ఎక్కడా కొరత లేకుండా అనతి కాలంలో సాధ్యమైనంత వరకు పనులు పూర్తి చేసింది. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకుండా, పనులను పూర్తి చేయకుండా తాత్సారం చేస్తూ గుంటూరును గుంటలూరుగా మార్చింది. చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు గుంటూరు పర్యటనకు వచ్చిన వైకాపా మంత్రులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రోడ్లు అధ్యానకరమైన పరస్థితిపై నిలదీయడంతో చేసేది ఏమీ లేక తప్పించుకునేందుకు గత ప్రభుత్వంపై బురద జల్లటం ఎంత వరకు సమంజసం కాదు. గుంటూరులో రోడ్లు మరమ్మతులకు, అభివృద్ధికి వెంటనే నిధులు మంజూరు చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.
మద్ధాళి గిరిధర్
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు