అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు:సీఎం

09–10–2019
అమరావతి


*అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు*
*అమలుకోసం రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌*
*ఎన్నికల్లో మరో హామీ అమలుకు రంగం సిద్ధం*
*మొత్తంగా యాభైశాతం మహిళలకు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి*
*కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాల స్థాయిలో విభాగాలు*
*జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నేతృత్వం, ఎక్స్‌అఫీషియోగా కలెక్టర్‌*
*లాభాపేక్ష లేకుండా కార్పొరేషన్‌ కార్యకలాపాలు*
*సాధారణ పరిపాలనా శాఖ నేతృత్వంలో కార్పొరేషన్‌*
*అవుట్‌సోర్సింగ్‌లో దళారీ వ్యవస్థ నిర్మూలన*
*అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలు*
*అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే పనికి ఒకేరకమైన జీతం*
*ఆన్‌లైన్‌ పద్ధతుల్లో జీతాల చెల్లింపు* 
*పోర్టల్‌ద్వారా నియామకాలు*
*డిసెంబర్‌ 1 నుంచి కార్పొరేషన్‌ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు*


అమరావతి: మరో కీలక హామీ అమలుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ రంగం సిద్ధంచేశారు. ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చేందుకు వీలుగా కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో మొత్తంగా యాభైశాతం మహిళలకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు లక్షమందికిపైగా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ వీరు ఆయా ఏజెన్సీల ద్వారా రిక్రూట్‌ అవుతున్నారు. నియమాకాల్లో అందరికీ అవకాశాలు దక్కకపోవడం, పనికి తగినట్టుగా ఉద్యోగులకు చెందాల్సిన జీతం పూర్తిస్థాయిలో లభించకపోవడం, సకాలంలో జీతాలు రాకపోవడం లాంటి సమస్యలను అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలు నడుపుతున్నవారు తమకు నచ్చిన రీతిలో ఈనియామకాలను చేపడుతున్నారు. వీటన్నింటికి పరిష్కారంగా, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఇచ్చిన హామీ అమలుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటవుతోంది. కార్పొరేషన్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.



సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్‌ పనిచేస్తుంది. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాల స్థాయిలో విభాగాలు ఏర్పాటవుతాయి. జిల్లా ఇన్‌ఛార్జిమంత్రులు ఈ విభాగాలకు నేతృత్వం వహిస్తారు, జిల్లా కలెక్టర్లు  కార్పొరేషన్‌కు ఎక్స్‌అఫీషియోలుగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రభుత్వ విభాగాలు తమకు కావాల్సిన సర్వీసులను కొత్తగా ఏర్పాటవుతున్న ఈ కార్పొరేషన్‌కు, దీనికింద జిల్లాల్లో ఉన్న విభాగాలకు నివేదిస్తాయి. కార్పొరేషన్‌ లాభాపేక్ష లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇప్పటివరకూ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవలను వివిధ ఏజెన్సీలద్వారా ప్రభుత్వం పొందుతోంది. దాదాపు 1లక్ష మంది పనిచేస్తున్నారు. ఏజెన్సీలు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వక,  సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతువన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కార్పొరేషన్‌ కారణంగా వీటికి చెక్‌పడనుంది. ఎలాంటి దళారీలు లేదా ఏజెన్సీలు లేకుండా నేరుగా ఈ కార్పొరేషన్‌ ద్వారా  అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను పొందే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా సమాజంలో అట్టడుగు వర్గాలకూ శ్రీ వైయస్‌.జగన్‌ నిర్ణయం ప్రకారం సముచిత ప్రాధాన్యత దక్కుతుంది. అంతేకాకుండా ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో అవుట్‌ సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న వారికి ఒకేపనికి ఒకే రకమైన జీతం లభిస్తుంది. ఈ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం జరక్కుండా, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌ద్వారా‡చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఒక పోర్టల్‌ ద్వారా అవుట్‌సోర్సింగ్‌ నియామకాలను చేపడతారు. అక్టోబరు 16న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. డిసెంబర్‌ 1 నుంచి కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image