తొలి సంక్షేమ పథకం అమలు

👆04.10.2019
ఏలూరు


*తొలి సంక్షేమ పథకం అమలు*
*ఏలూరులో వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం*
*హామీ ఇచ్చిన చోటే పథకం అమలు*
*ఖాకీ చొక్కా తొడిగిన ఆటోడ్రైవర్లు*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు రుణపడి ఉంటామన్న ఆటో డ్రైవర్లు*
*అంతకుముందు ప్రభుత్వ వైద్యకళాశాలకూ సీఎం శంకుస్థాపన*


*ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగు నెలల్లోనే మాట నిలబెట్టుకున్నామన్న సీఎం*
*ఆటో, మ్యాక్సీ, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలు, సమస్యలు పాదయాత్రలో స్వయంగా చూశాను*
*నాడు మాట ఇచ్చాను... ఇప్పుడు నెరవేరుస్తున్నాను*
*అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శకంగా పథకాన్ని అమలుచేశాం*
*ఎవరికైనా పథకం దక్కకపోయినా అక్టోబరు నెలాఖరు వరకూ దరఖాస్తుకు అవకాశం*
*కొత్తగా లబ్ధిదారులు ఉంటే నవంబర్‌లో వారికి పథకం అమలు*
*1,75,352 దరఖాస్తు చేస్తే, వారిలో 1,73,102 మందికి ఇప్పుడు లబ్ధి* 
*బీసీలు 79 వేలు, ఎస్సీలు దాదాపు 40 వేలు, ఎస్టీలు 6 వేలకు పైగా ఉన్నారని, ఇంకా మైనారిటీలు 17,500, కాపులు 20 వేలు, బ్రాహ్మణులు 397, ఈబీసీలు దాదాపు 9,995 మంది*
*పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడంలో వాలంటీర్ల పాత్ర భేష్‌*
*ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి*


ముఖ్యమంత్రిగారి ప్రసంగం:


సుదీర్ఘ పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ, మాక్సీ డ్రైవర్ల కష్టాలు స్వయంగా చూశానని, వారి బాధలు విన్నానని, అందుకే 'నేను ఉన్నాను' అంటూ నాడు 
పాదయాత్రలో భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైయస్సార్‌ వాహనమిత్ర పథకం ద్వారా సొంతంగా ఆటోలు, క్యాబ్‌లు, మాక్సీక్యాబ్‌లు నడుపుకుంటున్న వారికి రూ.10వేలు అందించారు. హామీ ఇచ్చిన ఏలూరులోనే ఇవాళ ఈ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే.., వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, 'వైయస్సార్‌ వాహనమిత్ర' పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెలాఖరు వరకు అవకాశం ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కొత్తగా ఎంపిక చేసిన వారికి నవంబర్‌లో పథకాన్ని వర్తింపచేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 


శుక్రవారం ఉదయం నేరుగా ఏలూరు చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలుత ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత స్థానిక ఇండోర్‌ స్టేడియమ్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీల డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సహాయం పథకం 'వైయస్సార్‌ వాహనమిత్ర' ను ప్రారంభించారు.  ఏలూరు ఇండోర్‌ స్టేడియమ్‌ వేదికగా ఒక మీట నొక్కడం ద్వారా ఆ మొత్తం సొంతంగా ఆటోలు, మ్యాక్సీలు, ట్యాక్సీలు నడుపుకునే 1.73 లక్షల డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.10వేల చొప్పున చేరింది. 
ఆటో డ్రైవర్లు అభిమానంతో సీఎంకు ఖాకీచొక్కా తొడిగారు. 


మాట నిలబెట్టుకున్నాను
 '2018, మే 14న ఏలూరులో పాదయాత్ర సందర్భంగా ఒక మాట ఇచ్చాను. ఆ మేరకు అధికారం చేపట్టిన కేవలం నాలుగు నెలల్లోనే అమలు చేస్తున్నాను. అది మీ అందరి చల్లని దీవెనల వల్లనే సాధ్యమైంది. అందుకు మీకు కతజ్ఞతలు' అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తన ప్రసంగం మొదలు పెట్టారు. 


గోడు విన్నాను. చూశాను


పాదయాత్రలో తనను కలిసిన ఆటో డ్రైవర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారని, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోతే రోజుకు రూ.50 ఫైన్‌ వేస్తున్నారని ఆవేదన చెందాదని తెలిపారు. దాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.
 'ఎఫ్‌సీ రావాలంటే ఇన్సూరెన్స్‌ చేయించాలి. దానికి దాదాపు రూ.7 వేలు ఖర్చవుతాయి. ఫిట్‌నెస్‌కు అవసరమైన రిపేర్ల కోసం ఖర్చు చేయాలి. రోడ్‌ ట్యాక్స్‌ కోసం కూడా మొత్తం చెల్లించాలి. వారు ఇన్ని కష్టాల్లో ఉన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను'.
 'అందుకే ఈరోజు మీ తమ్ముడిలా, మీ అన్నలా, మీ కుటుంబ సభ్యుడిగా.. నేను ఒక్కటే చెబుతున్నాను. నేను చూశాను. నేను విన్నాను. నేను ఉన్నాను.. అని చెప్పాను. అందుకే నాలుగు నెలలు కూడా తిరక్కముందే హామీని అమలు చేస్తున్నాను. ఇక్కడ బటన్‌ నొక్కగానే కేవలం రెండు గంటల్లో మీ ఖాతాల్లో రూ.10 వేలు జమ అవుతాయి. ఈ కార్యక్రమం ఏటా అమలు చేస్తాము. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.50 వేలు మీ ఖాతాల్లో జమ చేస్తాము' అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.


గతంలో ఎవరూ ఆలోచించలేదు
 ఆటో డ్రైవర్ల గురించి ఇప్పటి వరకు దేశంలో ఆలోచించలేదన్న సీఎం, అది ఇక్కడే జరిగిందని సగర్వంగా చెబుతున్నానన్నారు. ప్రతి పథకం అర్హుడైన ప్రతి ఒక్కరికి అందాలని ఆదేశిస్తున్నామని, ఇందులో ఎక్కడా వివక్ష చూపవద్దని స్పష్టం చేశామని చెప్పారు. 
ఎవరెవరు.. ఎంత మంది?


 వైయస్సార్‌ వాహనమిత్ర పథకంలో 1,75,352 దరఖాస్తు చేస్తే, వారిలో 1,73,102 మందికి ఇప్పుడు లబ్ధి చేకూరుస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వారిలో బీసీలు 79 వేలు, ఎస్సీలు దాదాపు 40 వేలు, ఎస్టీలు 6 వేలకు పైగా ఉన్నారని, ఇంకా మైనారిటీలు 17,500, కాపులు 20 వేలు, బ్రాహ్మణులు 397, ఈబీసీలు దాదాపు 9,995 మంది ఉన్నారని తెలిపారు. 


 ఎక్కడా అవినీతి లేకుండా, పూర్తి పారదర్శకంగా వైయస్సార్‌ వాహనమిత్ర పథకం అమలు చేశామని, ప్రతి ఒక్కటి ఆన్‌లైన్‌లో పెట్టామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఇంత మందికి  మేలు జరుగుతోందని, అందుకే ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. 


మరో అవకాశం
 'ఎవరైనా మిగిలిపోయి ఉంటే.. దరఖాస్తులో పొరపాటు చేసి ఉంటే లేదా దరఖాస్తు చేయకపోయినా.. ఈ పథకం ఈనెల 30 వరకు కొనసాగించమని అధికారులను ఆదేశించాను. కాబట్టి గతంలో దరఖాస్తు చేయకపోతే, వెంటనే చేయండి. మీకు గ్రామ సచివాలయాలు సహాయం చేస్తాయి. వారికి నవంబరులో ఈ పథకంలో సహాయం చేస్తాము' అని ముఖ్యమంత్రి ప్రకటించారు.


 ఈ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయడంలో సహకరించిన గ్రామ వలంటీర్లను అభినందిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు గ్రామ, వార్డు  సచివాలయాలు కూడా వచ్చాయని, దీంతో మరిన్ని సేవలు పూర్తి పారదర్శకంగా అందుతాయని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు.


పూర్తి పారదర్శకత


 వైయస్సార్‌ వాహనమిత్ర పథకం లబ్ధిదారుల పేర్లు, బ్యాంక్‌ ఖాతా వివరాలను వేదికపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చూపి, పథకం అమలులోని పారదర్శకతను సభకు చాటారు. 


 ఇంకా 5 కోట్ల మంది ప్రజలకు వెలుగు నిచ్చిన డాక్టర్‌ వైయస్సార్‌ కంటి వెలుగు పథకం ప్రచార కరపత్రాలతో పాటు, బ్యానర్‌ను ముఖ్యమంత్రి కార్యక్రమం చివరలో ఆవిష్కరించారు. ఈనెల 10 నుంచి ఆ పథకం తొలిదశ అమలు చేస్తున్నారు.


వేదికపై ఆటోడ్రైవర్లు స్పందన


 కాగా కార్యక్రమ ప్రారంభానికి ముందు మాట్లాడిన ఇద్దరు ఆటో డ్రైవర్లు తమ స్పందన తెలిపారు.
–సీహెచ్‌.విజయకుమార్, తాడేపల్లిగూడెం
 '10 వరకు చదివాను. బతకడం కోసం ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాను. 20 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. తొలుత నాకు సొంతంగా ఆటో లేదు. అద్దెకు తీసుకుని నడిపేవాణ్ణి. అయితే నాడు మహానేత వైయస్సార్‌ 2004లో స్వయం ఉపాధి పథకంలో ఈ ఆటో ఇప్పించారు. ఆయన చేతుల మీదుగా తాడేపల్లిగూడెం మాదవరంలో ఆటో అందుకుని అప్పటి నుంచి సొంత ఆటో నడుపుతూ బతుకుతున్నాను. అందుకు ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను'. 
 'ఇప్పుడు మాకు ఆ మహానేత తనయుడు సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఈ సహాయం చేయడమే కాకుండా ఆటోలకు రహదారి పన్ను నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. అందుకు ఆయనను ఎప్పటికీ మరువలేము'.
–సూరిబాబు. ఆటో డ్రైవర్‌.
 'ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు ఎప్పుడూ అండగా నిలుస్తాము. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాము.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం