డిఆర్డిఎ పిడిలు ప్రతినెలా 15 రోజుల పాటు ఫీల్డ్ లో పనిచేయాలి

అమరావతి
14.10.2019


*- విజయవాడలోని సెర్ఫ్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి డిఆర్‌డిఎ పిడిల సమీక్షా సమావేశం.*
*- సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెర్ఫ్ సిఇఓ రాజాబాబు.*


*- మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్‌...*
*- డిఆర్డిఎ పిడిలు ప్రతినెలా 15 రోజుల పాటు ఫీల్డ్ లో పనిచేయాలి.*
*- గ్రామీణాభివృద్ది కోసం కేటాయించిన పథకాల అమలును స్వయంగా పర్యవేక్షించాలి.*
*- ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలను, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అర్హలకు అందేలా చర్యలు తీసుకోవాలి.*
*- వచ్చే జనవరి నుంచి అదనంగా 7 లక్షల మందికి వైఎస్‌ఆర్ పెన్షన్లు.*
*- పెన్షన్ల ఎంపికలో గ్రామసచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల తో సమన్వయం చేసుకోవాలి.*
*- ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం.* 
*- పొదుపు సంఘాలు చెల్లించాల్సిన రుణాలను నాలుగు విడతలుగా వారి చేతికే అందిస్తాం.*
*- వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని ప్రారంభిస్తాం.*
*- ప్రజాసంకల్ప పాదయాత్రలో శ్రీ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తెస్తున్నాం.*
*- రాష్ట్రంలోని 9.33 లక్షల పొదుపు సంఘాలు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన రుణం రూ. 27,168 కోట్లు.*
*- ఈ రుణభారం నుంచి పొదుపు మహిళలను విముక్తి చేస్తాం.*
*- ఈ రుణాలకు గానూ ఈ ఏడాది ఏప్రిల్‌ 11వ తేదీలోగా బ్యాంకులకు  మహిళలు చెల్లించాల్సిన వడ్డీ రూ.1,823 కోట్లు.*
*- ఈ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించేందుకు సిద్దం.*
*- మొదటి అయిదు నెలల వడ్డీ కింద రూ. 760 ‌కోట్లు నేరుగా రుణ ఖాతాలకు జమ చేస్తాం.*
*- సున్నావడ్డీ కింద రూ.5 లక్షల రూపాయలకు లోబడి రుణాలు.*
*- ఈ వడ్డీని పొదుపు సంఘాల తరుఫున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లింపు.*
*- స్త్రీనిధి కింద ఈ ఏడాది స్వయం సహాయక సంఘాలకు కేటాయింపులను రూ.900 కోట్లు నుంచి రూ.1800 కోట్లకు పెంపు.*
*- స్త్రీ నిధి కింద ఇచ్చే ఆర్థిక తోడ్పాటును రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంపు.*
*- 168 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు మొదటిసారిగా ఆఫీస్‌ సదుపాయం.*
*- రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు, పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు 76 గోడవున్‌ లతో కూడిన ఇన్‌ పుట్‌ షాప్‌ల ఏర్పాటుకు నిర్ణయం.*
*- రైతు సంస్థలే స్వయంగా నిర్వహించుకునేలా 92 ఉత్పత్తి ఆధారిత ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం.*
*- ఎఫ్ పి ఓల ద్వారా తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను రైతులకు అందించేందుకు రూ.33 కోట్లు విడుదల.*
*- ప్రతినెలా 5వ తేదీన వైఎస్‌ఆర్‌ పెన్షన్లను అందించాలి.*
*- వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ.*
*- అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలి.*
*- గ్రామస్థాయిలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా నవరత్నాలు సక్రమంగా అందేలా పిడిలు, సెర్ఫ్ సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలి.*


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం