హాకీ అభివృద్దికి తోడ్పడండి

హాకీ అభివృద్దికి తోడ్పడండి
గవర్నర్ కు విన్నవించిన హాకీ అసోసియేషన్
                రాష్ట్రంలో హాకీ క్రీడాభివృద్దికి తోడ్పాటును అందించాలని ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్ కు విన్నవించారు. జాతీయ స్ధాయిలో భువనేశ్వర్ మంచి హాకీ క్రీడాకారులను తయారు చేసే ప్రాంతంగా ప్రసిధ్ది నొందగా, ఎఫిని సైతం ఆదిశగా పయనింపచేసే క్రమంలో సహకారం అందించాలని కోరారు.  ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేయన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, అంతర్జాతీయ సాంకేతిక అధికారి హర్షవర్ధన్ తదితరులు మంగళవారం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసారు. అతి త్వరలో జరగనున్న రాష్ట్ర హాకీ ఆసోసియేషన్ ఐదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అవార్డులు అందించాలని గవర్నర్ కు విన్నవించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన బిశ్వభూషన్ , తగిన సమయం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 
ఈ నేపధ్యంలో  ఒరిస్సాలోని భువనేశ్వర్ కేంద్రంగా హాకీ శిక్షణ అభివృద్ది చెందిన క్రమాన్ని మాననీయ గవర్నర్ గుర్తు చేసుకున్నారు. నాడు గవర్నర్ ఒరిస్సా రాష్ట్ర అమాత్యునిగా ఉన్న సమయంలో హాకీ అభివృద్దికి తీసుకున్న చర్యలు ఇప్పుడు సత్ ఫలితాలను ఇస్తూ రాగా అదే పరిస్ధితిని ఆంద్రప్రదేశ్లో కూడా తీసుకురావాలని అకాంక్షించారు. మరోవైపు గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్ అధ్యక్షునిగా కీలక బాధ్యతలలో ఉండగా, అంతర్జాతీయ స్దాయిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఉండేలా తగిన తోడ్సాటును అందించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా జరిగేలా చూడాలని గవర్నర్ స్పష్టం చేసారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image