దాదాపు 6.02 లక్షల మందికి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం :

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట్ట 


దాదాపు 6.02 లక్షల మందికి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం :


ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌


        శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 రోజుల్లో దాదాపు 6.02 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ తెలిపారు.


        రాంభగీచా 2లోని మీడియా సెంటర్‌లో సోమ‌వారంనాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో విఐపి దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 తగ్గించి సామాన్య
భక్తులకు పెద్దపీట వేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు నిర్వహణ, తక్కువ వ్యవధిలో సంతృప్తికర దర్శనం కల్పించినట్లు వివరించారు. స్వామివారి వాహన సేవలు వీక్షించిన భక్తులందరికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపారు. శ్రీవారి కైంకర్యాల సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా శ్రీవారిని దర్శించుకున్నట్లు వివరించారు. భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు అధికంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు.


శ్రీవారి హుండి ద్వారా ఈ ఏడాది 7 రోజులకు రూ. 17.97 కోట్లు లభించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్ధం ముందస్తుగా  8.5  లక్షల లడ్డూలు సిద్ధంగా వుంచినట్లు వివరించారు. శ్రీవారి భక్తులకు ఇప్పటి వరకు 30.15 లక్షల లడ్డూలు అందించినట్లు తెలియజేశారు. ప్రతి రోజు శ్రీవారి వాహన సేవల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేశామ‌న్నారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి నేతృత్వంలో అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆయన వెల్లడించారు.


ఈ కార్యక్రమంలో  టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి డా.టి.ర‌వి,పేష్కార్‌ శ్రీ శ్రీ‌నివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Popular posts
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
దసరా సెలవుల్లో.. రైళ్లు.. ఫుల్‌
చాలా మంది త్వరలో వస్తారు... వారెవరో అప్పుడు మీరే చూస్తారు
టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనా విడుదల చేసిన చంద్రబాబు
Image