ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

18–10–2019
అమరావతి


అమరావతి: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి .జగన్‌ సమీక్ష
కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలతో ముందుకు సాగాలన్న సీఎం


వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందులను ఉంచడం, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం అందించడం, తీవ్రవ్యాధులతో సతమతం అవుతున్న వారికి ప్రతినెలా పెన్షన్, కొత్తగా 108, 104 వాహనాలు కొనుగోలు, ఆస్పత్రుల అభివృద్ధిద్వారా ఆరోగ్యరంగాన్ని బలోపేతానికి మార్గదర్శక ప్రణాళిక సూచించిన సీఎం


నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లోని ఆరోగ్యశ్రీ కింద 150 ఆస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలు, సీఎం నిర్ణయం


డిసెంబర్‌ 1నుంచి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం
నెలకు రూ.5వేలు లేదా, రోజుకు రూ.225
తీవ్రకిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికే కాకుండా తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి  రూ.10వేల వర్తింపు చేయాలని సీఎం ఆదేశం
రూ. 5వేల కేటగిరిలో మరో నాలుగు వ్యాధులు చేర్చాలని సీఎం ఆదేశం
తీవ్ర పక్షవాతంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారికీ, రెండు కాళ్లు లేక చేతులు లేనివారు లేక పనిచేయని స్థితిలో ఉన్నవారికీ, కండరాల క్షీణతతో పనిచేయని పరిస్థితిలో ఉన్నవారికి రూ.5వేల పెన్షన్‌ వర్తింపు, జనవరి 1 నుంచి వీరికి పెన్షన్‌ 


జనవరి 1 నుంచి ప.గో.లో 2వేల వ్యాధులకు, మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్య శ్రీ పైలట్‌ప్రాజెక్టు కింద అమలు
డెంగూ, సీజనల్‌ వ్యాధులకు ఇందులో చోటు కల్పించాలన్న సీఎం


గిరిజన ప్రాంతాల్లో బైకులద్వారా వైద్యసేవలను మారుమూలప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం


ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న సీఎం


అన్ని కమ్యూనిటీ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల అభివృద్ది కార్యక్రమాలు డిసెంబర్‌ 2019 నుంచి పనులు మొదలు, డిసెంబర్‌ 2020 నాటికి ఈ పనులు పూర్తి
బోధనాస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధంచేయాలన్న సీఎం


ఆస్పత్రుల్లో మందులకు కొరతలేకుండా, మందులు నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
మందులు దొరకడంలేదన్న కంప్లైంట్‌ ఎక్కడా రాకూడదన్న సీఎం


హెల్త్‌ సబ్‌సెంటర్లలో అభివృద్ది కార్యక్రమాలు కూడా వచ్చే మే నుంచి పనులు ప్రారంభమవ్వాలని సీఎం ఆదేశం


ఆరోగ్యశ్రీలో డబుల్‌ కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ను చేర్చాలన్న సీఎం


డిసెంబర్‌ 21న ఆరోగ్యకార్డుల జారీ


ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్‌ వర్కర్లకు రూ.రూ.16వేలు పెంచేలా వెంటనే జీవో జారీచేయాలని సీఎం ఆదేశాలు


కంటి వెలుగు కార్యక్రమాన్ని కాలేజీల పిల్లలకూ వర్తింప చేయాలన్న సీఎం
నెలరోజుల్లో కాలేజీ పిల్లలకూ పరీక్షలు చేయాలన్న సీఎం


కంటి వెలుగు కార్యక్రమం మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు
స్కూలు పిల్లనుంచి ఈ కార్యక్రమం మొదలు 


మధుమేహం, బీసీ, సుగర్‌ లాంటి వ్యాధులను తగ్గించడానికి తగిన తరగతులు స్కూళ్లు, గ్రామాల్లోనిర్వహించాలన్న సీఎం


అన్ని జాతీయ రహదారుల్లో మద్యం దుకాణాలను తొలగించాలని సీఎం ఆదేశం
మద్యం దుకాణాలకోసం గతంలో కొన్నిటిని డీ నోటిఫై చేశారని సమావేశంలో ప్రస్తావన
వాటిని తిరిగి జాతీయ రహదారుల జాబితాలో యాడ్‌ చేయాలన్న సీఎం
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు ఆస్పత్రికి వస్తే... డబ్బుకోసం వేచిచూడాల్సిన అవసరంలేదనే రీతిలో తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
ప్రభుత్వం నుంచే కొంతమొత్తాన్ని దీనికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం, విధివిధానాలు ఖరారుచేయాలన్న సీఎం
త్వరలోనే కార్యక్రమాన్ని ప్రకటించాలని సీఎం ఆదేశం


వెద్యారోగ్యశాఖలో ఖాళీలభర్తీ ప్రక్రియ జనవరిలో మొదలుపెట్టాలన్న సీఎం


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image