విజయవాడ (ఇంద్రకీలాద్రి )
గురువారం 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం
" ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణి కుండలాధ్యం
మందస్మితం మృగ మదోజ్వల ఫాలదేశమ్"
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు దసరా ఉత్సవాలలో 5వ రోజు గురువారం శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శ్రీ చక్ర అధిష్టానశక్తిగా , పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులను , ఉపాసకులను అనుగ్రహిస్తుంది.
శ్రీ లక్ష్మీదేవి , శ్రీ సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూవుండగా చిరుమందహాసంతో , వాత్సల్య జితోష్ణలను చిందిస్తూ , చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీలలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు . త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తులచేత పూజలందుకొంటారు . ..