నాటు సారా నిర్మూలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు

 


విజయవాడ (ప్రసాదంపాడు)


తేదీ: 21.10.2019ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన మద్యపాన నిషేధం  మరియు నాటు పారా నిర్మూలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించామని  డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్  సి . హరికుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


 రాష్ట్ర వ్యాప్తంగా విసృతంగా దాడులు నేపధ్యంలో  అక్టోబర్ 1  నుంచి ఇప్పటి వరకు 208 నాటు  సారా కేసులు నమోదు చేసి,  518 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసామన్నారు.  9858 . 44 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని 2 , 49 , 217 లీటర్ల పులిసిని బెల్లపు ఆటను ద్వాంసం చేసి 63 వాహనములను స్వాధీనం చేసుకున్నామన్నారు.   బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలకు సంబంధించి 480 కేసులు నమోదు చేసి,  484 మంది  ముద్దాయిలను అరెస్ట్ చేసి 5996 . 115 లీటర్ల మద్యం , 1020 . 04 లీటర్ల బీరు ర మరియు 19 వాహనములను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.   ఇంకా పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యంనకు సంబంధించి 124 కేసులు నమోదు చేసి 123 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 146 . 85 లీటర్ల మద్యం , 14 . 83 లీటర్ల బీరు మరియు 26 వాహనములను స్వాధీనం చేసుకోవడం జరిగిందని హరికుమార్ తెలియ చెయ్యడం జరిగింది. 


 నాటు సారా నిర్మూలనకై రాష్ట్రం లోని 13 జిల్లాలలో టాస్క్ ఫోర్స్ , ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.  ఏక్సయిజ్ శాఖ అధికారుల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని  ఎస్పి లకు నాటు సారా రవాణా , విక్రయాలకు అవకాశం వున్న గ్రామాలను గురించిన సమాచారం అందచేయడమైనదన్నారు.   రాబోయే వారంకు సంబంధించి మద్యపాన నిషేధం  మరియు నాటు పారా నిర్మూలనలో భాగంగా సమగ్ర  కార్యాచరణ ప్రణాళికలను అందరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్లకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 


-----–------------–-------------–--------


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం