ప్రజారాజధానిపై మీ అబద్దాలకు హద్దులేదా?

26-10-2019,


           గుంటూరు.


బహిరంగ లేఖ


గౌ|| బొత్స సత్యనారాయణ గారికి..


 ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖమంత్రి


 


ప్రజారాజధానిపై మీ అబద్దాలకు హద్దులేదా?


  ఒక సామాజిక వర్గం కోసమని, ముంపు ప్రాంతమని..  ప్రజారాజధానిపై రోజుకొక నింద వేస్తున్నారు. కూర్చున్న కొమ్మనే మీరు నరుకుతున్నారు. 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులు, ఉద్యోగాలు కల్పించగల రాజధాని ఆంధ్రులకు అవసరం లేదా.? హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకు ధీటుగా ఆంధ్రులకు రాజధాని లేకుంటే ఇక్కడకు వచ్చి ఎవరు పెట్టుబడులు పెడతారు.? ప్రజా రాజధానికి కుల తత్వం, ప్రాంతీయ తత్వం అంటగట్టి ప్రజల్ని రెచ్చగొట్టడం అంటే మంత్రి స్థాయిని దిగజార్చడం కాదా.? ఈ కింది ప్రశ్నలకు మంత్రి బొత్స సత్యనారాయణ గారు సూటిగా సమాధానం చెప్పగలరా.?


1. 28.6.2019న ఏపీసీఆర్డీఏపై జగన్‌ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. అందులో రూ.5,674 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రూ. 5,674 కోట్లు మొత్తం ఖర్చయితే పీటర్‌ కమిషన్‌ పేరుతో లీకైన నివేదికలో రూ.30వేల కోట్లు రాజధానిలో దుబారా అయిందని చెప్పడం పచ్చి అబద్దం కాదా? పీటర్‌ వైఎస్‌ మేనత్త కుమారుడనేది వాస్తవం కాదా? అమరావతిపై అపోహలు సృష్టించడానికి పీటర్‌ని నియమించడం వాస్తవం కాదా?


 


2. చంద్రబాబు ప్రారంభించిన సైబరాబాద్‌ నగర నిర్మాణాన్ని వైఎస్‌ ప్రభుత్వం అడ్డుకోలేదు. నిర్మాణాన్ని కొనసాగించారు. కనుకనే నేడు సైబరాబాద్‌ 13 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించింది. 2018-19లో లక్ష కోట్లకుపైగా ఐటీ ఎగుమతులు చేసింది. తెలంగాణ బడ్జెట్‌కు ఒక్క హైదరాబాద్‌ నగరమే 60 శాతంపైగా ఆదాయం సమకూరుస్తున్నది. హైదరాబాద్‌ని చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారు. దాంతో తెలంగాణలోని అన్ని జిల్లాల అభివృద్ధిలో ఇది కీలకంగా ఉన్నది వాస్తవం కాదా? అమరావతి అభివృద్ధిని నాశనం చేయడమంటే 13 జిల్లాల ఏపీ అభివృద్ధికి గండికొట్టడం కాదా?


3. అమరావతిలో భవన నిర్మాణాలకు చదరపు అడుగుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.12వేలు ఖర్చు చేసిందని వైసీపీ నాయకులు, మంత్రులు పదేపదే అబద్దాలు చెబుతున్నారు. అసెంబ్లీ భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.5,333, హైకోర్టు భవనాలకు చ.అ.కు రూ.3,666, సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలకు ఫర్నీచర్‌, సెంట్రల్‌ ఏసీ, 50 ఎకరాల అభివృద్ధి కలిపి చ.అ.కు రూ.7,101, ఎమ్మెల్యే, ఆలిండియా సర్వీస్‌ అధికారుల భవనాలు, ఎన్జీఓ భవనాలకు చ.అ.కు రూ.3,459 ఖర్చు అయింది. ఈ లెక్కలన్నీ బొత్స గారి వద్ద ఉన్నా, చ.అ.కు టీడీపీ ప్రభుత్వం రూ.12వేలు ఖర్చు చేసిందని పదే పదే అబద్దాలు ఎందుకు చెబుతున్నారు? మీ రివర్స్‌ డెవలప్‌మెంట్‌ విధానాల వైఫల్యం కప్పిపెట్టుకోవడానికి కాదా?


4. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు నగరాలకు ధీటైన రాజధాని ఆంధ్రులకు లేకపోతే ఏపీలో ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? ఉద్యోగాలు ఎలా వస్తాయి? 13 జిల్లాల అభివృద్ధికి ఆదాయం ఎలా సమకూరుతుంది? తెలంగాణ బడ్జెట్‌లో ఒక్క హైదరాబాద్‌ నగర ఆదాయమే సింహ భాగం ఉన్నది వాస్తవం కాదా? హైదరాబాద్‌ ఆదాయంతోనే తెలంగాణ జిల్లాలన్నింటి అభివృద్ధి జరుగుతోందనేది వాస్తవం కాదా?


5. శివరామకృష్ణన్‌కు వచ్చిన, సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం అత్యధికులు అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలని కోరింది వాస్తవం కాదా? విజయవాడ-గుంటూరు-అమరావతి ప్రాంతంలో రాజధాని ఉండాలని 2,191 మంది కోరగా, విశాఖకు 507, కర్నూలుకు 360, తిరుపతికి 113, దొనకొండకు 116 అభిప్రాయాలు వచ్చింది వాస్తవం కాదా? రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున ఉన్న అమరావతికన్నా మించినది మరేమున్నది? శాతవాహనులు, వాసిరెడ్డివారు, నాగార్జునా చార్యులకు కేంద్రంగా, రాజధానిగా ఉన్న అమరావతి నేడు జగన్‌ రెడ్డి గారికి ఎందుకు రుచించడంలేదు. కుల తత్వం, ప్రాంతీతత్వం లాంటి సంకుచిత మనస్తత్వం ఉన్నవారికి పాలకులుగా ఉండే అర త ఉన్నదా?


6. అమరావతిలో రాజధానిని జగన్‌ బలపరిచింది వాస్తవం కాదా? రాజధానికి 30 వేల ఎకరాలకు తక్కువ కాకుండా ఉండాలని జగన్‌ మాట్లాడింది అసెంబ్లీ రికార్డుల్లో ఉన్నది వాస్తవం కాదా? నేడు అందుకు విరుద్ధంగా మీరెందుకు మాట్లాడుతున్నారు?


7. ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ బ్యాంకు రాజధానికి అతి తక్కువ వడ్డీపై మంజూరు రూ.5వేల కోట్ల రుణం మీ అసమర్ధత వల్ల రద్దయినది వాస్తవం కాదా?


8. రాజధాని నిర్మాణాలన్నీ నిలుపుదల చేయడం వల్ల, ప్రజా వేదికను కూల్చి రాజధాని ప్రాంత ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయడం వల్ల ఒక్క రాజధాని భూముల విలవే లక్ష కోట్లు పడిపోయింది వాస్తవం కాదా? ఈ ప్రభావంతో రాష్ట్రమంతా భూముల విలువ పడిపోయి రిజిస్ట్రేషన్ల ఆదాయం ప్రభుత్వానికి పడిపోయింది నిజం కాదా? హైదరాబాద్‌ భూముల విలువ 30 శాతం పెరిగింది వాస్తవం కాదా?


9. హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ జగన్‌ గారికి, వారి అనుచరులకు భూములున్నందువల్ల రేట్లు పెంచుకునేందుకు అమరావతిని డ్యామేజ్‌ చేస్తున్నారా? లేక దొనకొండలో వారి భూములు అమ్ముకొనేందుకు అమరావతిని దెబ్బతీస్తున్నారా? లేక హైదరాబాద్‌కు ధీటుగా అమరావతి ఉండరాదనే కేసీఆర్‌ కోరిక నెరవేరుస్తున్నారా?


10. అమరావతి ముంపు ప్రాంతమని మీరు చెప్పింది అబద్దం కాదా? అమరావతి ముంపు ప్రాంతం కాదని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, ఇస్రో నిర్ధరించింది నిజం కాదా? 1850, 2009లో పెద్ద వరదలు వచ్చినా ఎలాంటి ముంపు జరగలేదని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు పేరా 76లో చెప్పింది వాస్తవం కాదా?


11. బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో 500 ఎకరాలిచ్చి ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ చేశారనే మీ ఆరోపణ పచ్చి అబద్దంకాదా? బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వలేదని రుజువైంది వాస్తవం కాదా?


12. అమరావతిలో ఫౌండేషన్‌ ఖర్చులు హైదరాబాద్‌, చెన్నై కన్నా తక్కువ అని ఇంజనీరింగ్‌ నిపుణులు ప్రకటించింది నిజం కాదా? అమరావతిలో ఖర్చు ఎక్కువ అన్న మీ ప్రకటన అబద్దం కాదా?  అమరావతిలో రాకీ స్టార్టా ఎల్‌ 11 మీ. డెప్త్‌, చ.మీ.కు 150 టన్నుల బేరింగ్‌ కెపాసిటీ ఉన్నది. హైదరాబాద్‌ రాకీ స్టార్టా కారణంగా బ్లాస్టింగ్‌ చేయాలి. బేస్‌ మెంట్‌ 7.1 మీటర్లు, బ్లాస్టింగ్‌ 4.5 మీటర్లు మొత్తం 11.6 మీటర్లు డెప్త్‌, దీనికి తోడు కృష్ణా, గోదావరి నీటి సరఫరా ఖర్చులు,  చెన్నైలో బేరింగ్‌ కెపాసిటీ చ.మీ.కు 10 మెట్రిక్‌ టన్నులే. ఫైల్‌ ఫౌండేషన్‌ 30 నుంచి 40 మీటర్ల లోతు నుంచి వేయాలి. రాజధానుల సాయిల్‌ స్ట్రెక్త్‌ కు సంబంధించి మద్రాసు ఐఐటీ నిపుణుల అంచనాలకు విరుద్దంగా మంత్రి బొత్స చేత జగన్‌ రెడ్డి గారు అబద్దాలు చెప్పిస్తున్నది వాస్తవం కాదా?


13. అమరావతి స్వయం ఆధారిత అభివృద్ధి (సెల్ఫ్‌ ఫైనాన్స్‌) ప్రాజెక్ట్‌. అమరావతిలో రైతులకు ఇవ్వగా ప్రభుత్వానికి మిగిలిన భూముల విలువ లక్ష కోట్లు అనేది వాస్తవం కాదా? ఇందులో 50 వేల కోట్లు ఖర్చు చేస్తే హైదరాబాద్‌ కు దీటైన రాజధాని అంధ్రులకు ఏర్పడుతుందనేది నిజం కాదా? రాజధాని నుంచే రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు జమ కావడం నిజం కాదా? రాజధాని అమరావతి. బహుళ ప్రయోజనకారి కాదా.?


14. ఒక సామాజిక వర్గం కోసమే రాజధాని అంటూ అబద్దాలు చెప్పడమే కాక కుల చిచ్చు పెట్టడం మంత్రి స్థాయిని దిగజార్చడం కాదా? ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ఉండటం జగన్‌ గారికి ఇష్టంలేదా? రాజధానిలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు 75 శాతం ఉన్న మాట నిజం కాదా? 29 పంచాయతీల్లో 15 పంచాయితీల్లో కాపులు గణనీయంగా ఉన్నారు.    రెడ్డి, కమ్మ జనాభా కుడి ఎడమగా ఉన్నది వాస్తవం. తుళ్లూరు, తాడేపల్లిలలో రెడ్లు, కమ్మవారికి భూములు సమానంగా వున్నది నిజం కాదా? ఈ వాస్తవాలు కప్పిపెట్టి ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గంపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం కాదా? విజయవాడ, గుంటూరులలో బ్రాహ్మణ, వైశ్య, ముస్లిం జనాభా గణనీయంగా ఉన్నారు. అమరావతి కులాల కాస్మాపాలిటిన్‌ ప్రాంతం అనేది నిజం కాదా? 


15. రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదు, ఒక శాశ్విత కట్టడం లేదనే మీ పార్టీ విమర్శలు పచ్చి అబద్దాలు కాదా? సచివాలయం, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు భవనాలు శాశ్వితం కాదా? ఇటుకలు లేకుండా నిర్మించారా?


16. అమరావతిలో గ్రాఫిక్స్‌ రోడ్లపై తిరుగుతున్నారా?


17. 29 గ్రామాల పేదలకు నిర్మించిన 5వేల గృహాలు గ్రాఫిక్స్‌ యేనా?


18. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉద్యోగుల గృహసముదాయాలు గ్రాఫిక్స్‌ గానే ఉన్నాయా?


19. హేపీనెస్ట్‌ కు ఎన్‌ఆర్‌ఐల స్పందన కూడా మీకు గ్రాఫిక్స్‌ లా కనిపిస్తోందా?


20. విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత యూనివర్సిటీలు, ఎక్సెల్‌ ఆర్‌ఐ, ఎయిమ్స్‌ నిర్మాణాలు  గ్రాఫిక్సేనా?


21. కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ గ్రాఫిక్సేనా?


22. రైతులు రాజధాని కోసం 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రపంచంలో ప్రత్యేకత కలిగిన అంశంగా హార్వార్డ్‌ విశ్వవిద్యాలయంలో చర్చించలేదా?


23. రాజధానిలో 8వేల కోట్లతో పనులు చేసింది వాస్తవం కాదా? అందులో 1500 కోట్లు కేంద్రం ఇచ్చింది నిజం కాదా?


24. 22.10.2019 నాటికి ప్రధాన మంత్రి అమరావతికి శంకుస్థాపన చేసి 4 ఏళ్లు గడిచింది వాస్తవం కాదా? కొత్త రాజధానులన్నింటికన్నా అమరావతిలో నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎంతో ఎక్కువగా ఉన్నదనేది వాస్తవంకాదా?


25. స్విస్‌ ఛాలెంజ్‌ కేసు సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ హైకోర్టు ప్రాంతంలో కనీసం టీ కూడా లభించడంలేదు. జడ్జీల క్వార్టర్లు ఇప్పటిదాకా నిర్మించలేదు. పనుల జాప్యంతో హైకోర్టులో సమస్యలు. పనులు మీరు చేస్తారా? ఆదేశాలు ఇవ్వాలా? అని వ్యాఖ్యానించారు. ఇది జగన్‌ ప్రభుత్వ అసమర్థతకు, ద్రుక్పద లోపానికి నిదర్శనం కాదా?ఇట్లు
  


 గోరంట్ల బుచ్చయ్య చౌదరి    కింజరాపు అచ్చెన్నాయుడు


   టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత      టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత


 


  


 నిమ్మల రామానాయుడు    డొక్కా మాణిక్యవరప్రసాదరావు


 టీడీపీ శాసనసభాపక్ష నేత     టీడీపీ శాసన మండలిపక్ష ఉపనేత


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం