పథకాలు అమలే అజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది

అమరావతి


రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలే అజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది


ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చ జరగనుంది. 


నవరత్నాల్లోని కీలకమైన సంక్షేమ పథకాల అమలు కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 


వైఎస్​ఆర్ ఆసరా పథకంలో భాగంగా చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే అంశంపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. 


పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చించనుంది.


మత్స్యకారుల సంక్షేమ కోసం ... చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే మొత్తాన్ని పది వేలకు పెంచే అంశంపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. 


గతంలో మత్స్యకారులకు రూ. 4500 చెల్లించిన ప్రభుత్వం...ప్రస్తుతం పరిహారాన్ని 10 వేలకు పెంచాలని నిర్ణయించింది. 


ఈ అంశంపై కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.


ఇక డ్వాక్రా మహిళల కోసం గతంలో వెలుగు పేరుతో చేపట్టిన పేదరిక నిర్మూలన పథకాన్ని వైఎస్ఆర్ క్రాంతి పథంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఇక ఇప్పటికే తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా కేబినెట్ రాటిఫై చేయనుంది. 


వ్యవసాయ మిషన్ సమావేశంలో వైఎస్సార్ రైతు భరోసా పథకానికి వేయి రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని కేబినెట్ రాటిఫై చేయనుంది. 


ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 


దీని కోసం ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించిన క్రమంలో.. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు నేటి మంత్రివర్గ భేటీలో గ్రీన్ సిగ్నల్ లభించనుంది. 


వ్యవసాయ కమిషన్ సమావేశంలో మిల్లెట్, పల్సెస్, ప్యాడీ బోర్డులను ఏర్పాటు చేయటం ద్వారా ఆయా రంగాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టవచ్చన్న ప్రతిపాదన వచ్చింది. 


దీనికి సీఎం జగన్ ఆమోదం లభించటంతో ఈ బోర్డుల ఏర్పాటు అంశం మంత్రి వర్గ భేటీలో చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. 


పాఠశాలల అభివృద్ధికి 'మన బడి నాడు-నేడు' పేరుతో ప్రత్యేకంగా ఓ పథకాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైనా కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం.


త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా రిజర్వేషన్ల అంశంపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. 


సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంది.


ప్రస్తుతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 59.5 శాతంగా ఉండటంతో దీన్ని కుదించే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


వివాదమవుతున్న పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, పీపీఏల వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 


ఇక కొత్త ఇసుక విధానం గురించి సీఎం జగన్ మంత్రుల వద్ద ప్రస్తావించే సూచనలు కనిపిస్తున్నాయి.


మొత్తం 15 అంశాలతో కూడిన అజెండాపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image