కోటంరెడ్డిపై ఫిర్యాదు, బెయిల్‌ అంతా ఒక డ్రామా : పంచుమర్తి అనురాధ

కోటంరెడ్డిపై ఫిర్యాదు, బెయిల్‌ అంతా ఒక డ్రామా : పంచుమర్తి అనురాధ
అమరావతి : టీడీపీ మహిళా నేతలను వైసీపీ ఇబ్బంది పెడుతోందని ఆ పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. వైసీపీకి పాజిటివ్‌గా ఉండే వర్కర్లను తన్నారని, అఖిలప్రియ భర్తపై 307 సెక్షన్ కింద కేసు ఎలా పెట్టారని ఆమె ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీద ఫిర్యాదు, బెయిల్‌ అంతా ఒక డ్రామా అని కొట్టిపారేశారు. కోటంరెడ్డి మీద చర్యలు తీసుకోవాలన్నారు. బోటు ప్రమాదంపై చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. మృతుల విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు.