ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కి కళా వెంకటరావు లేఖ

తేది 15-10-2019 


బహిరంగ లేఖ 


ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గారికి, 


నమస్కారములు..


 రైతుల గురించి మీరు చెప్పింది కొండంత.. చేస్తోంది గోరంత. రుణమాఫీ జీవో రద్దుతో రైతులను నిలువునా ముంచిన మీరు.. ఇప్పుడు రైతు భరోసా సాయానికి పెద్దమొత్తంలో కోత విధిస్తూ మరోసారి తడిగుడ్డతో వారి గొంతుకోశారు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. అన్నదాతలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు జవాబివ్వండి..


1. బడ్జెట్‌లో 64.06 లక్షల మందికి పథకం వర్తింపజేస్తామని హామీనిచ్చి.. అమలులో మాత్రం 54 లక్షలకు కుదించారు. 15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 3 లక్షలకు తగ్గించారు. ఇది నమ్మకద్రోహం కాదా..?


2. రైతులకు ఒకేదఫాలో ఏటా రూ.12,500 ఇస్తామని 2017లో జరిగిన ప్లీనరీలో  ప్రకటించారు. అంటే రాష్ట్ర నిధుల నుండే ఇస్తానని హామీనిచ్చారు. 2017 నాటికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ రూ. 6వేలు ప్రకటించలేదు. హామీపై నిలబడే వారైతే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు కేంద్రం ఇస్తున్న రూ.6వేలతో పాటు రాష్ట్రం నుండి రూ.12,500 మొత్తం రూ.18,500 వేలు ఇవ్వాలి. రూ.18,500కి బదులు రూ.13,500 ఇస్తామంటే రూ.5వేలు ఒక్కొక్క రైతుకు ఎగనామం పెట్టడం కాదా..?


3. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుండి రూ.13,500కి బదులు కేవలం రూ.7,500 మాత్రమే చెల్లిస్తూ.. రూ.13,500 ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది అబద్ధం కాదా..? రైతు దగా కాదా..?   


4. ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.50 వేల వరకు లబ్ధి చేకూరుస్తామని మేనిఫెస్టోలో తెలిపి.. (7,500þ5)  రూ.37,500మాత్రమే ఇస్తూ.. రూ.67,500 ఇస్తున్నట్లు చెప్పడం అబద్ధం కాదా..? ఇది రైతు ద్రోహం కాదా..?  


5. ''రైతు రుణమాఫీ రూ.1,50,000ను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారా..'' అని టీడీపీని విమర్శించిన వైకాపా.. ఒకే విడతలో రైతు భరోసా పూర్తిచేస్తామని ఘంటాపథంగా చెప్పి ఇప్పుడు రూ.7,500ని మూడు ముక్కలు చేయడం మాట తప్పడం కాదా..?


6. తెలుగుదేశం హయాంలో రూ. 50వేల లోపు రైతు రుణాలను ఒకే దఫాలో రద్దు చేసింది నిజం కాదా..? రైతు రుణమాఫీ ద్వారా ఒక్కో రైతు రూ.1,10,000 లబ్ధి పొందినది వాస్తవం కాదా..?  


7. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే.. 4, 5 విడతల రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు రూ.40వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.10వేలు చొప్పున ఒక్కో రైతుకు సగటున సుమారు రూ.50వేల వరకు ఇప్పుడు లబ్ధి చేకూరేది. ఆ పథకాల రద్దుతో మీరు రైతును దగా చేసింది వాస్తవం కాదా..? చంద్రన్నే అధికారంలో కొనసాగి ఉంటే రైతుకు రూ.90వేలు వచ్చి ఉండేవి. ఇందుకు మీరు ఇస్తున్నది కేవలం రూ.37,500లే కదా..?  


8. కులాలు, మతాలకతీతంగా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి.. నేడు నిబంధనల పేరుతో అన్నదాతల మధ్య కులాల కుంపట్లు పెట్టడం దుర్మార్గం కాదా..? 


9. కేంద్రం ఇచ్చిన 2వేల రూపాయలను జూన్‌ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేసినట్లు అర్థం వచ్చే విధంగా ప్రకటించడం.. రైతులను మోసగించడం కాదా..?    


10. సున్నావడ్డీ కింద రూ.4వేల కోట్లు ఇస్తామని.. బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే పెట్టారు. ఇది రైతు ద్రోహం కాదా..?  


11. ధరల స్థిరీకరణ నిధి ప్రకటించినా.. టమాటా, ఉల్లి రైతులకు మాత్రం మద్ధతు ధరను అందించడం లేదు. ఇది వంచన కాదా..? 


12. మీ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో 14,565 మంది రైతుల ఆత్మహత్యలకు పాల్పడితే.. మీ 4నెలల పాలనలోనే 190 మంది రైతులు బలయ్యారు. ఇక రైతు బతుకుకు మీరు కల్పించిన భరోసా ఏమిటి..?  


13. మీ తండ్రి హయాంలో ఉచిత విద్యుత్‌ అంటూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా జరిగిన విద్యుత్‌ సరఫరాతో 500 మంది పాముకాట్లకు గురై బలయ్యారు. మీ పాలనలో రోజుకు 3-4 గంటలు విద్యుత్‌ సరఫరానే ఉండటం లేదు. అలాంటప్పుడు 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ అంటూ చెప్పడం రైతుల్ని దగా చేయడం కాదా..? తెలుగుదేశం హయాంలో 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటును అధిగమించి 100 రోజుల్లోనే 24þ7 కరెంట్‌ సరఫరా చేసింది వాస్తవం కాదా..?      


14. మన విత్తనాలు తెలంగాణకు తరలించారు. విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడి ప్రాణాలు విడిస్తే కన్నెత్తి చూడలేదు. అలాంటి మీకు రైతు సంక్షేమంపై మాట్లాడే అర్హత ఎక్కడుంది..?  


15. వర్షాలు పడి కృష్ణా నదిలో వరద పొంగిపొర్లినా నేటికీ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని రిజర్వాయర్లు నింపలేకపోయారు. సుమారు 550 టీఎంసీల నీటిని సముద్రం పాలైన మాట వాస్తవం కాదా.?


   గత ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే తక్కువ ఇస్తూ.. తెలుగుదేశం ప్రభుత్వం కంటే గొప్పగా చేస్తున్నామని అబద్ధాలతో ఇంకెన్నాళ్లు ప్రజలను మోసపుచ్చుతారు..? నిజంగా రైతుల పట్ల బాధ్యత ఉండి, వారి బాధలు అర్థం చేసుకున్న ఏ ఫ్రభుత్వమూ ఈవిధంగా వ్యవహరించదు. పైకి దయామయులమంటూ వైకాపా నాయకులు ఆడుతున్న జగన్నాటకాలను రైతన్నలు ఏనాడో గ్రహించారు. ఇప్పటికైనా మోసపుచ్చే వైఖరికి స్వస్తిపలికి.. రైతు రుణమాఫీ నిధులతో పాటు రైతులకు మీరు ఇస్తామన్న రూ.12,500ను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి కేటాయించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి.   


         Sd/- 


         (కళా వెంకట్రావు)            తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు


Popular posts
చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ..