వైకాపాఅంటే 144 పార్టీనే :మాజీమంత్రి జవహర్ ధ్వజం

 


*వైకాపాఅంటే 144 పార్టీనే*
*మాజీమంత్రి జవహర్ ధ్వజం*


ప్రజల అవసరాలు తీర్చలేని పరిస్థితిలో అధికార పార్టీ ఉందని మాజీమంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయం నుంచి ఒక పత్రిక  ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలో వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడిందని మండిపడ్డారు.ఈ నేపథ్యంలోనే ఇసుక కొరతను నిరసిస్తూ మచిలీపట్నంలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన శాంతియుత దీక్షను ప్రభుత్వం అడ్డగించటం దారుణమైన చర్యగా భావిస్తున్నామన్నారు. పార్టీ నాయకులను అరెస్టులు చేసినంత మాత్రాన ప్రజా సమస్యలు పరిష్కారం కాదన్నారు.ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా 30 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రతి చోట 144 సెక్షన్లతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకోవాలని అగ్రహించారు. ప్రజల బాధలను అర్థం చేసుకోవాలంటే రూ.వేల కోట్ల రూపాయలు కూడబెట్టడం కాదని జవహర్ ప్రశ్నించారు.ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ నిరంతరం ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోందని గుర్తుచేశారు.