.
వరంగల్ న్యూస్ రవీందర్ గుప్తా(అంతిమ తీర్పు).......
బ్యాక్ టూ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం గాంధీ జయంతి కార్యక్రమాన్ని హన్మకొండ చౌరస్తా లోని సొసైటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బ్యాక్ టూ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్.వి.నగేష్ బాబు మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ చూపిన శాంతి, అహింస మార్గలో నడుస్తూ ఆదర్శ ప్రయమేన జీవితాన్ని గడపాలి అన్నారు.ప్రధాన కార్యదర్శి కొలగని రాజేందర్ మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గంలో నడుస్తునే మన వంతుగా పది మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో బ్యాక్ టూ సొసైటీ ని స్థాపించి సేవ కార్యక్రమంలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దాడిగల రమేష్,కోశాధికారి గూడెం శ్యామ్,రంజీత్, అశోక్, సీనియర్జర్నలిస్ట్ రవీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.