జలవనరులశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

28–10–2019
అమరావతి


అమరావతి: జలవనరులశాఖపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో ఉన్న రిజర్వాయర్ల నీటిమట్టాలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎంకు వివరించిన అధికారులు
ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనులనుపై సీఎంకు వివరాలు నివేదించిన అధికారులు
ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం, వెలిగొండ, వంశధార సహా, కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపైనా అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం
ఇంత వరద వచ్చినా కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నింపకపోవడంపై సీఎం ఆరా
కాల్వల సామర్థ్యం, పెండింగులో ఉన్న పనులపై అధికారుల నుంచి సమాచారం కోరిన ముఖ్యమంత్రి
వరదజలాలు వచ్చే 40 రోజుల్లో అన్ని ప్రాజెక్టులు నిండేలా కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం
దీనిపై ప్రతిపాదనలతో పూర్తి నివేదిక  ఇవ్వాలని ఆదేశాలు
అలాగే ప్రస్తుతం నడుస్తున్న, తప్పకుండా కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి ఆమేరకు అంచనాలను ఈ నివేదికద్వారా ఇవ్వాలన్న ముఖ్యమంత్రి
నిధుల వినియోగంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్న ముఖ్యమంత్రి
ప్రాధాన్యతల పరంగా ఖర్చు చేయాలి: సీఎం
చేసిన ఖర్చుకు ఫలితాలు వచ్చేలా ఉండాలి:సీఎం
భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా చాలావరకు జలయజ్ఞం పనులు పెండింగులో ఉండిపోతున్నాయన్న అధికారులు
వీటికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అధికారులు
ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలన్న సీఎం