ప్రపంచ దృష్టి దినోత్సవం అక్టోబర్ 10 సందర్భంగా “వైయస్సార్‌ కంటి వెలుగు

*తాడేపల్లి*
*09.10.2019*


*ప్రజారోగ్య రంగంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ మరో విప్లవాత్మక కార్యక్రమం*


*ప్రపంచ దృష్టి దినోత్సవం అక్టోబర్ 10 సందర్భంగా “వైయస్సార్‌ కంటి వెలుగు"*


*రేపు అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి*


*రాష్ట్రంలోని 5.40 కోట్ల మంది ప్రజలకు నేత్ర వైద్య పరీక్షలు*


*మొదట బడిపిల్లలతో ప్రారంభం*


*అక్టోబర్ 10 నుంచి 16 వరకు తొలిదశలో 70 లక్షల మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు*


*నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రెండోదశలో అవసరమైన వైద్య చికిత్సలు*


*స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా వైద్య సేవలు ఉచితం*


*మొత్తం ఆరు దశల్లో , మూడేళ్లపాటు వైయస్సార్‌ కంటివెలుగు అమలు*


*మూడు, నాలుగు, ఐదు, ఆరు దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు*


*ఫిబ్రవరి 1 నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు*


అమరావతి: 
ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజలందరికీ కంటి సమస్యలు దూరంచేయడానికి బృహత్తర కార్యక్రమం అమలును ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలు చేసి, వారికి అవసరమైన చికిత్సలను అందిస్తుంది. పరీక్షలనుంచి శస్త్రచికిత్సల వరకూ అన్ని సేవలనూ ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాథికల్పన తనకు అత్యంత ప్రాముఖ్యతలని స్పష్టంచేశారు. ఈమేరకు మేనిఫెస్టోలో తానిచ్చిన హామీలను అమలు చేసేదిశగా వడివడిగా అడుగులు వేస్తూ, ఒక్కో కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో అధికారులతో సమీక్షల సందర్భంగా ఈ రంగాల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు చాలామంది పౌష్టికాహారం, రక్తహీనత లాంటి సమస్యలతోపాటు కంటి సమస్యలతోకూడా ఎక్కువగా బాధపడుతున్నారని, దీన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశాలు జారీచేశారు. దీంట్లో భాగంగానే వైయస్సార్‌ కంటివెలుగు కార్యక్రమం రూపొందింది. ప్రతి మంగళవారం స్పందనపై సమీక్ష సందర్భంగా వైయస్సార్‌ కంటివెలుగును ఎలా నిర్వహించాలన్నదానిపై  వైద్యారోగ్య శాఖ అధికారులతోపాటు, జిల్లా కలెక్టర్లతోనూ సీఎం సమీక్షించారు. సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకుని వైయస్సార్‌ కంటి వెలుగుకు కార్యాచరణ సిద్ధంచేశారు. 
వైయస్సార్‌ కంటివెలుగులో భాగంగా మొదటగా సుమారు 70 లక్షల మంది బడిపిల్లలు అందరికీ ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ అన్నింటిలోకూడా ఈపరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబరు 10 నుంచి అక్టోబరు 16 వరకూ 6 పనిదినాల్లో ఈకార్యక్రమం పూర్తవుతుంది. కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ విజన్‌ సెంటర్లకు పంపిస్తారు. జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు జిల్లాస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. అన్ని పీహెచ్‌సీలకు కంటిపరీక్షలకు సంబంధించిన కిట్లను ఇప్పటికే పంపించారు. 42360 మంది ఆశావర్కర్లు, 62500 మంది టీచర్లు, 14000 మంది ఏఎన్‌ఎంలు, 14000 మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే వైయస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. 


ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు మొదటి విడతలో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు, ఆరు దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిభ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. 


 'వైయస్సార్‌ కంటివెలుగును ఈనెల 10వ తేదీన (రేపు) అనంతపురంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు. అక్టోబరు 10, ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై వైయస్సార్‌ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం