విద్యా దాత వై యస్ ఆర్.. ఉపాధి దాత వై యస్ జగన్..
మహాత్ముడు కి నివాళులర్పించిన దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.
విజయవాడ.
తేదీ.2-10-19.
అవినీతి లంచాలు లేని పారదర్శక పాలన వై యస్ ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయం లోనే సాద్యమవుతుందనీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పశ్చిమ నియోజక వర్గం గాంధీజీ మహిళా కళాశాల లో గాంధీజీ 150 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత గాంధీ జి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. పెరుగుతున్న ఆధునిక జీవితం లో పోటీ పడుతున్న యువత గాంధీజీ అహింస సిద్దాంతాన్ని అలవరుచు కోవాలని. ఆయన స్ఫూర్తితో ప్రగతిని సాధించాలని ఆయన అశయ సాధనకు కృషి చేయటమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. నగరానికి గాంధీ జి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, నగరం లో ఉన్న ఏకైక మహిళా కళాశాల అంటే గాంధీజీ మహిళా కళాశాలే అన్నారు. ఈ సందర్భం గా కళాశాల అభివృద్ది కి కృషి చేస్తున్న నిర్వాహకులు సి ఎల్ కాంతారావు ను అభినందించారు. నేడు వై యస్ అర్ సిపి ప్రభుత్వము ఎంతో పారదర్శకం గా గ్రామ సచివాలయం ఎర్పాటు చేసిందన్నారు, ఎ రాష్ట్రం లో లేని విధంగా ప్రభుత్వ సంక్షేమా లను, పథకాలను ఒకే చోట అందించే విధంగా గ్రామ సచివాలయం రూపొందించటం జరిగిందన్నారు. నాడు వై యస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చేసి విద్యా దాత అయ్యారని నేడు సిఎం జగన్ మోహన్ రెడ్డి ఎటువంటి అవినీతి లంచాలు లేకుండా ఎంతో పారదర్శకం గా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించి యువతకు ఉపాధి దాతగా జగన్ మోహన్ రెడ్డి నిలిచారన్నారు. అనంతరం పేద మరియు ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొనకళ్ల విద్యాద్ద ర రావు, కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.