‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ప్రారంభించిన సీఎం వైఎస్‌

'వైఎస్సార్‌ రైతు భరోసా' ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌
 సర్వేపల్లి (నెల్లూరు)  : అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏడాదికి రూ.13,500 ఆర్థిక సహాయం ఇచ్చే 'వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌' పథాకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం ఉదయం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు భరోసా పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. రైతు భరోసా పథకం ప్రారంభ కార్యక్రమంలో అబ్దుల్‌ కలాం చిత్రపటానికి సీఎం వైఎస్‌ జగన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.  అన్నదాతలకు అండగా ఉంటానని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాతలకు చేయూతనిచ్చే రైతు భరోసా పథకాన్ని మాట ఇచ్చిన నెల్లూరు జిల్లా నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి అన్నదాతల విశ్వసనీయతను సీఎం వైఎస్‌ జగన్‌ చూరగొన్నారు. మంగళవారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ రేణిగుంట విమానశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి విక్రమ సింహపురి వర్సిటీ చేరుకున్నారు. అక్కడ వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రైతుభరోసా పథకం లబ్దిదారులైన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ తొలి సారి నెల్లూరుకు రావడంతో జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని రైతాంగం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.    మేనిఫెస్టో ప్రకారం 2020లో ప్రారంభం కావాల్సిన రైతు భరోసా - పిం.ఎం కిసాన్  పథకం  ఏడాది ముందుగానే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. రూ. 12,500కు మరో వెయ్యి పెంచి రూ. 13,500 పెట్టుబడిసాయంగా రైతులకు అందనుంది. జూన్ నెలలో రూ. 2000 ఇప్పటికే అందించారు. మరో రూ. 9,500 అక్టోబర్ నెలలో జమచేస్తారు. మరో రూ. 2000 సంక్రాంతికి అందించనున్నారు. ఈ సొమ్ము బ్యాంకులో పాత అప్పులకు జమ కట్టకుండా రైతుల చేతికి అందేవిధంగా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కుటుంబాలకు పెట్టుబడి సాయం ఐదేళ్లకు కలిపి 67,500 అందనుంది. దాదాపు 54 లక్షల మంది ఈ పథకంలో లబ్దిదారులయ్యారు. కౌలు రైతుల కుటుంబాలకూ సాగు కుటుంబాలతో పాటుగా ఈ పథకాన్ని వర్తింప చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్కే చెల్లుతుంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో కౌలు రైతులకు మేలు చేసిన సీఎం మరొకరు లేరని రాజకీయ విశ్లేషకులు, రైతులు పేర్కొంటున్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image